Begin typing your search above and press return to search.
రజినీ కంటే అక్షయ్ కు ఎక్కువ...!
By: Tupaki Desk | 26 Sep 2018 2:35 PM GMTసౌత్ సినీ ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘2.0’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను అదుగో ఇదుగో అంటూ దాదాపు సంవత్సరంనర కాలంగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక భాషల్లో 3డి వర్షన్ లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో రజినీకాంత్ తో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా నటించిన విషయం తెల్సిందే.
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘రోబో’ చిత్రానికి ఇది రెండవ వర్షన్ అని, మొదటి పార్ట్ కు ఈ పార్ట్ కు కథ విషయంలో సంబంధం లేదు అంటూ దర్శకుడు శంకర్ చెబుతూ వస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ విజువల్ వండర్ అంటూ అంతా కూడా ప్రశంసలు కురిపించారు. ఇంత కాలం ఎదురు చూసినందుకు ఈ చిత్రం ఒక అద్బుతంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంతా అంటున్నారు. అయితే టీజర్ లో అక్షయ్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఇవ్వక పోవడంతో విమర్శలు వ్యక్తం అయ్యాయి.
2.0 చిత్రం అత్యధిక వసూళ్లు నమోదు చేయాలి అంటే రజినీకాంత్ కంటే ఎక్కువ అక్షయ్ కుమార్ ను ఫోకస్ చేస్తూ ప్రమోషన్ చేయాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నాడు. అందుకే థియేట్రికల్ ట్రైలర్ లో రజినీకాంత్ కంటే ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ అక్షయ్ కుమార్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో కూడా రజినీకాంత్ కంటే ఎక్కువ అక్షయ్ కుమార్ ఉంటాడని సమాచారం అందుతుంది. దీపావళి కానుకగా ఈ చిత్రం ట్రైలర్ను నవంబర్ 7న విడుదల చేయాలని నిర్ణయించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంకు ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందించగా, అమీజాక్సన్ హీరోయిన్గా నటించింది. రెండు వేల కోట్ల టార్గెట్ తో ఈ చిత్రం విడుదల కాబోతుంది.