Begin typing your search above and press return to search.
తన వంతుగా కోటిచ్చిన గబ్బర్
By: Tupaki Desk | 15 Dec 2015 4:22 PM GMTమొన్ననే ఠాగూర్ సినిమా హిందీ రీమేక్ 'గబ్బర్ ఈజ్ బ్యాక్'తో అందరినీ ఆకట్టుకున్న అక్షయ్.. ముఖ్యంగా సౌత్ ప్రేక్షకుల హృదయాన్ని తట్టాడు. ఆ సినిమాకు మాతృకలు తెలుగు, తమిళంలో సూపర్ హిట్లు. అందుకే ఆ సినిమాను అక్షయ్ ఎలా చేశాడని అందరూ చూశారు. పైగా తీసింది మన తెలుగు దర్శకుడు క్రిష్ కాబట్టి.. ఇంకా ఆసక్తి పెరిగింది. ఇకపోతే ఈ బాలీవుడ్ యాక్షన్ హీరో ఇప్పుడు తన సహృదయాన్ని చాటుకున్నాడు.
చెన్నై వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలు విరాళం అందించాడు అక్షయ్ కుమార్. చెన్నై వరదలు తనను ఎంతో కలచి వేశాయని, అందుకే బాధితులకు తనవంతు సాయం చేయాలని భావించాడట. తనతో హేరా ఫేరి, గరమ్ మసాలా, కట్టా మీటా, బాగమ్ బాగ్ వంటి సినిమాలను మళయాళ దర్శకుడు ప్రియదర్శన్ కు ఫోన్ కొట్టి.. ఎలా హెల్ప్ చేయమంటావ్ గురువా అని అడిగితే.. ఆయన నటీమణి సుహాసిని ఈయన్ను లింక్ చేశారు. ఆవిడ సదరు భూమిక ట్రస్టుకు విరాళం అందజేయి అని చెప్పగా.. అక్షయ్ ఇప్పుడు ఆ ట్రస్టుకు కోటి చెక్కొకటి చెక్కిచ్చాడు.
చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు భూమిక ట్రస్టు విశేష సేవలు అందిస్తోంది. అక్షయ్ కుమార్ నుంచి భూమిక ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, దర్శకనిర్మాత జయేంద్ర రూ. కోటి చెక్కు అందుకున్నారు. మరో ప్రక్క షారూఖ్ ఖాన్ కూడా చెన్నై వరద బాధితులకు 1 కోటి ఇచ్చిన సంగతి తెలిసిందే. మన హీరోల్లో అల్లు అర్జున్ 25 లక్షలు, మహేష్ బాబు 10 లక్షలు.. ఇచ్చారు.