Begin typing your search above and press return to search.

దేశంలో మరే హీరో చేయని పనిని చేసిన బాలీవుడ్ యాక్షన్ హీరో

By:  Tupaki Desk   |   2 March 2020 4:17 AM GMT
దేశంలో మరే హీరో చేయని పనిని చేసిన బాలీవుడ్ యాక్షన్ హీరో
X
అపన్నులకు సాయం చేస్తూ తమలోని మరో యాంగిల్ ను ప్రదర్శిస్తుంటారు సినీ స్టార్లు.. సెలబ్రిటీలు. తాజాగా అలాంటి పనే మరొకటి చేసి వార్తల్లో వ్యక్తిగా మారారు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. సాయం కోసం ఎవరు తన వద్దకు వచ్చినా.. వారికి అండగా నిలిచే గుణమున్న ఆయన.. దేశంలోనే మరే హీరో చేయని ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దర్శకుడు రాఘవ లారెన్స్ తో కలిపి చెన్నైలో హిజ్రాల కోసం ఇళ్లు నిర్మించే ప్రాజెక్టుకు తన విరాళంగా రూ.1.5కోట్ల మొత్తాన్ని అందజేశారు. హిజ్రాల ఇళ్ల నిర్మాణం కోసం ఒక హీరో ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించటం దేశంలోనే ఇది తొలిసారిగా పేర్కొంటున్నారు.

ఈ విషయాన్ని బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానితో పాటు.. దర్శకుడు లారెన్స్ సైతం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. తమ ట్రస్టు ద్వారా భూమిని సేకరిస్తామని.. ఇళ్ల నిర్మాణం కోసం మరిన్ని నిధులు సేకరిస్తామని లారెన్స్ వెల్లడించారు.

లక్ష్మి బాంబ్ షూటింగ్ సందర్భంగా హిజ్రాల ఇళ్ల నిర్మాణం మీదా.. తన ట్రస్టు గురించి చెప్పానని.. ఆ వెంటనే ఆయన స్పందించి భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారన్నారు. తన ప్రాజెక్టు కు అక్షయ్ ఇస్తున్న మద్దతు కు లారెన్స్ కృతజ్ఞతలు చెబుతున్నారు. ఏమైనా ఒక మంచి కార్యక్రమానికి భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వటం ద్వారా అక్షయ్ మరోసారి తన పే..ద్ద మనసును ప్రదర్శించారని చెప్పక తప్పదు.