Begin typing your search above and press return to search.

28 ఏళ్ళలో ఎన్నడూ లేని కష్టం

By:  Tupaki Desk   |   5 Nov 2018 12:19 PM IST
28 ఏళ్ళలో ఎన్నడూ లేని కష్టం
X
బాలీవుడ్ హీరోల్లో కమర్షియల్ ఫార్ములాకు దూరంగా సినిమాలు చేసే వాళ్ళలో అందరు అమీర్ ఖాన్ గురించి ముందు చెప్పుకుంటారు కానీ ఇప్పుడా ప్లేస్ ని అక్షయ్ కుమార్ ఆక్రమించుకున్నాడనే చెప్పాలి. మార్కెట్ వేల్యూ పరంగా కాకపోయినా సబ్జెక్టుల విషయంలో అక్షయ్ కుమార్ అవలంబించే ధోరణి మిగిలిన వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. టాయిలెట్ పేరుతో సినిమా అనే ఆలోచన చిన్న హీరో సైతం చేయడు. అలాంటిది దాని మీద వంద కోట్లు రాబట్టడం ఒక అక్షయ్ కే చెల్లింది.

ప్యాడ్ మ్యాన్ థీమ్ తో ఇంకో హీరో అయితే జంకేవాడేమో అక్షయ్ కాబట్టి దాన్ని కూడా బ్లాక్ బస్టర్ చేసి చూపించాడు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు. రాబోతున్న 2.0 ఒక ఎత్తు. పక్షి రాజుగా కాకిని పోలిన విచిత్రమైన మొహంతో సెల్ ఫోన్ల కణాలు మొహంలో నింపుకున్న వింత ఆకారంతో భయపెట్టేలా ఉన్నాడు అక్షయ్. దీని మేకప్ కోసం తన 28 ఏళ్ళ జీవితంలో ఏ సినిమాకు పడనంత కష్టపడ్డాను అని చెబుతున్న అక్షయ్ కుమార్ తనకు మేకప్ పట్టినంత సమయం బహుశా ఇప్పటిదాకా ఏ హీరోయిన్ కు ఉండదని చెబుతున్నాడు. దీన్ని బట్టే ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.

ప్రోస్థటిక్స్ తో పాటు వివిధ రకాల మేకప్ పద్ధతులు ఉపయోగించి అక్షయ్ కుమార్ కు ఈ లుక్ వచ్చేలా విదేశీ నిపుణులు సైతం దీనికి ఎంతో కష్టపడ్డారు. ఇప్పటిదాకా భారతీయ వెండితెరపై ఏ విలన్ కనిపించనంత దుర్మార్గంగా అక్షయ్ అరాచకం చేస్తాడని ఇన్ సైడ్ టాక్. సెల్ ఫోన్స్ వల్ల కలిగే విధ్వంసాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకునే పక్షి రాజుగా అక్షయ్ కుమార్ నెవెర్ బిఫోర్ రోల్ లో కనిపిస్తాడు. నార్త్ లో మాత్రం రజని కంటే ఎక్కువగా అక్షయ్ కోసమే 2.0ని చూడబోతున్నారట.