Begin typing your search above and press return to search.
ఆఫ్టర్ కరోనా: సినిమాకు 99 కోట్లు తీసుకుంటున్న హీరో
By: Tupaki Desk | 14 Dec 2020 9:47 AM GMTబాలీవుడ్ లో ‘ఖాన్’ల త్రయం కనుమరుగై ఇప్పుడు అక్షయ్ కుమార్ సహా హిందూ హీరోల హవా కొనసాగుతోంది. దేశంలో బీజేపీ అధికారంలో ఉండడం కూడా వీరి ఎదుగుదలకు కారణంగా బాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు. అది వేరే విషయం.. ఇక మరో కారణం ఏంటంటే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలు ఆడకపోవడం.. భారీ ఫ్లాప్ లతో వారు సినిమాలు తగ్గించడం.. అదే సమయంలో సీనియర్ హీరో అక్షయ్ కుమార్ వరుస హిట్ సినిమాలతో ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటాడు.
తాజాగా అక్షయ్ కుమార్ గురించి ఓ క్రేజీ గాసిప్ చక్కర్లు కొడుతోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతల మీద కాస్త దయ చూపి రెమ్యూనరేషన్ ను ఆ మేరకు తగ్గించాడట అక్షయ్. ఆ విధంగా.. తన రెమ్యూనరేషన్లో రూ.పది నుంచి ఇరవై కోట్ల రూపాయల మొత్తాన్ని తగ్గించి ఫైనల్ గా 99 కోట్ల రూపాయల పారితోషికం ఫిక్స్ చేశాడట.తాజాగా సాజిద్ నడియావాలా రూపొందిస్తున్న 'బచ్చన్ పాండే' సినిమాకు అక్షయ్ కుమార్ ఏకంగా 99 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పొందుతున్నాడనేది అనధికార సమాచారం.
ఒక్క సినిమాకు 99 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడా? అని టాలీవుడ్ లో అందరూ షాక్ అవుతున్నారు కానీ.. కథ అంతకు మించే ఉందట... ఈ రూ.99 కోట్లు కూడా తగ్గించిన పారితోషికమేనట. నిజానికి.. రూ.110 నుంచి 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే స్థాయిలో అక్షయ్ కుమార్ మార్కెట్ ఉందట..
అక్షయ్ నటించే సినిమాలకు భారీ ఓపెనింగ్సే వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యనే వచ్చిన 'లక్ష్మీ బాంబ్' మాత్రం డిజాస్టర్ అయ్యింది. సౌత్ లో అందరినీ ఆకట్టుకున్న "కాంచన" మూవీనే లారెన్స్ హిందీలొ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కానీ.. అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే.. నాన్ థియేటర్ రిలీజ్ కావడంతో.. ఆ సినిమా కలెక్షన్ల లెక్కలు తేలవు కాబట్టి. అక్షయ్ గ్రాఫ్ తగ్గిందని చెప్పే అవకాశాలు లేవు.దీంతో అక్షయ్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదట..