Begin typing your search above and press return to search.
కొడుకు కోసం ఒప్పుకుంటే 90 కోట్ల లాభం..!
By: Tupaki Desk | 10 March 2019 1:30 AM GMTబాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీర్లో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉన్నాడు. చేసిన ప్రతి సినిమాతో ఈ ఖిలాడీ స్టార్ సూపర్ హిట్ ను అందుకుంటూనే ఉన్నాడు. దాంతో ఈయన్ను డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీదకు తీసుకు వచ్చేందుకు అమెజాన్ గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేసింది. అయితే స్టార్ హీరో అయిన తాను బుల్లి తెరపైకి రావడం ఏంటనుకుని నో చెబుతూ వచ్చాడు. ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అమెజాన్ వారు అతి పెద్ద యాక్షన్ రియాల్టీ సిరీస్ కు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం అక్షయ్ కుమార్ కు ఏకంగా 90 కోట్ల రూపాయల పారితోషికంను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక వెబ్ సిరీస్ కోసం ఇండియన్ స్టార్ ఇంత పారితోషికం తీసుకోవడం రికార్డుగా చెప్పుకుంటున్నారు. ఇటీవలే ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఒక కార్యక్రమంలో భాగంగా శరీరానికి నిజంగా నిప్పు అంటించుకుని మీడియా ముందుకు అక్షయ్ కుమార్ వచ్చిన విషయం తెల్సిందే. ఇంత భారీ క్రేజీ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం వెనుక అక్షయ్ కుమార్ తనయుడు ఉన్నాడట.
తండ్రి అమెజాన్ కు నో చెబుతున్న విషయం తెలుసుకున్న ఆరవ్ ఇందుకు ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పమని తండ్రిని ఆరవ్ బలవంత పెట్టాడట. కొడుకు కోసం మొదట పారితోషికం గురించి కూడా ఆలోచించకుండా ఓకే చెప్పాడట. తీరా పారితోషికం వరకు వెళ్లేప్పటికి 90 కోట్ల రూపాయలను అమెజాన్ వారు ఇచ్చేందుకు కమిట్ అవ్వడం, అగ్రిమెంట్ అవ్వడం చకచక జరిగిందట. కొడుకు మాట కాదంటే 90 కోట్ల డీల్ చేజారేదని అక్షయ్ అభిప్రాయ పడుతున్నాడట.