Begin typing your search above and press return to search.

కన్ఫ్యూజన్ కామెడీతో రూ.200 క్రాస్ చేశాడు

By:  Tupaki Desk   |   5 Jan 2020 4:42 AM GMT
కన్ఫ్యూజన్ కామెడీతో రూ.200 క్రాస్ చేశాడు
X
ఏడాదిలో నాలుగు సినిమాలు. అది కూడా ప్రతి సినిమా రూ.100 కోట్లు దాటేయటం సాధ్యమేనా? అంటే నో చెప్పేస్తారు తెలుగు ప్రజలు. ఎందుకంటే టాలీవుడ్ లో ఒక హీరో ఏడాదికి ఒక సినిమా విడుదల చేయటమే కష్టంగా మారిన వేళ.. ఏడాదిలో నాలుగు సినిమాలు.. అవన్నీ భారీగా వసూళ్లు సాధించటం అంత తేలికైన విషయం కాదు. తాజాగా అలాంటి రికార్డును తన పేరు మీద రాయించుకున్నారు బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్.

2019లో అక్షయ్ కు మామూలుగా కలిసి రాలేదు. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా చేసిన సినిమాలతో అదరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకున్నాడు. కేసరి.. మిషన్ మంగళ్.. హౌస్ ఫుల్ 4 తో పాటు.. డిసెంబరు చివరి వారంలో విడుదలైన గుడ్ న్యూస్ ఒక దానికి మించి మరొకటి విజయాన్ని సాధించాయి. వరుసపెట్టి నాలుగు సినిమాలు విడుదల కావటం ఒక ఎత్తు.. విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవటమే కాదు.. భారీగా వసూళ్లను సాధించాయి.

కన్ఫ్యూజన్ కామెడీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుడ్ న్యూస్ తాజాగా రూ.200 కోట్ల మార్కును దాటేసింది. వారం వ్యవధిలో ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రూ.161.9కోట్ల మార్కును చేరుకోగా.. విదేశాల్లో సైతం రూ.45.86కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తంగా 207.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం కృత్రిమ గర్భధారణ నేపథ్యంలో తెరకెక్కించారు. వీకెండ్ లో రూ.65 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తొలి వారంలో రూ.207 కోట్ల కలెక్షన్లను చేరుకోవటం విశేషం. రూ.105 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లుగా చెప్పే ఈ చిత్రానికి కాసుల వర్షం కురుస్తుందని చెప్పాలి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే 2019లో నాలుగు సినిమాల్ని చేసిన అక్షయ్ కుమార్.. ఈ ఏడాదిలోనూ ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుచెబుతున్నారు. ఖిలాడీ.. కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్..రోహిత్ శెట్టి సూర్వవంశీ.. పృథ్వీరాజ్ చిత్రంతో పాటు మరో మూవీ కూడావిడుదలకు రెఢీ అవుతుందని చెబుతున్నారు. టాలీవుడ్ హీరోలు అక్షయ్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది కదూ?