Begin typing your search above and press return to search.
అనుమతి లేకుండా హెలీకాఫ్టర్ లో హీరో షికార్?
By: Tupaki Desk | 5 July 2020 4:47 AM GMTబాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ సేవాతత్పరత- దేశభక్తి గురించి తెలిసిందే. ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ నుంచి వచ్చి హిందీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు అక్షయ్. అందుకు తగ్గట్టే అతడిలోని దేశభక్తి నిరంతరం బయటపడుతూనే ఉంది. మొన్న లాక్ డౌన్ పరిస్థితుల్లో అక్షయ్ ఎంతో సేవ చేశారు. పేదల కష్టాలు తీర్చేందుకు కోట్లలో డొనేషన్లు ప్రకటించారు.
అయితే అతడు లాక్ డౌన్ సమయంలో హెలీకాఫ్టర్ జర్నీ చేశారని అది నిబంధనలకు విరుద్ధమని మహారాష్ట్ర కు చెందిన మంత్రి చగన్ భుజ్ బల్ ఆరోపించడం సంచలనమైంది. ముంబై నుంచి నాసిక్ కు హెలీకాఫ్టర్ లో వెళ్లేందుకు అతడికి ఎవరు అనుమతి ఇచ్చారు? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వివాదం రాజకీయంగా కొత్త టర్న్ తీసుకుంటోందని అర్థమవుతోంది. అక్షయ్ నాసిక్ పర్యటన ప్రభుత్వానికి తెలియదని .. ముందస్తు సమాచారం ఏదీ లేదని సదరు మంత్రి గారు ఆరోపిస్తున్నారు. ఇకపోతే అక్షయ్ ఆ సమయంలో లాక్ డౌన్ నిబంధన ఉల్లంఘించాల్సిన అవసరం ఏమిటి? నాసిక్ ఎందుకని వెళ్లారు? అంటే అక్కడ ఓ డాక్టర్ ని కలిసేందుకు అక్షయ్ వెళ్లారట. ఈ విషయాన్ని స్థానిక పత్రికల ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని భుజ్ బల్ ఆవేదనను వ్యక్తపరిచారు.