Begin typing your search above and press return to search.
నెమ్మదిగా స్టార్ హీరోని సైడేయిస్తున్న కుర్ర హీరో!
By: Tupaki Desk | 15 Nov 2022 2:30 AM GMTవిధి చాలా విచిత్రమైనది. లైఫ్ జర్నీలో ఊహకందనివి ఎన్నో జరుగుతుంటాయి. ఇక సినీప్రపంచంలో ఎప్పుడు ఏ అవకాశం ఎటు తారు మారు అవుతుందో చెప్పలేం. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్! అన్న చందంగా ఎవరికి ఏ అవకాశం వస్తుందో ఎవరికి ఏ అవకాశం చేజారుతుందో కూడా కనిపెట్టలేం. సెంటిమెంటు పరిశ్రమలో సక్సెస్ అనేది స్టార్లను అజేయంగా ముందుకు నడిపిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి ఒక సన్నివేశంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్థానంలో కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ కర్ఛీఫ్ వేసేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
ఇటీవలే భూల్ భులయా సీక్వెల్ నుంచి అక్షయ్ వైదొలగాక ఆ స్థానంలో వచ్చిన కార్తీక్ ఆర్యన్ అదిరిపోయే హిట్టు కొట్టి సత్తా చాటాడు. కరోనా క్రైసిస్ తర్వాత బాలీవుడ్ ని ఆదుకున్న హీరోగా అతడి పేరు మార్మోగింది. ఓవైపు అక్షయ్ నటించిన భారీ చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా డిజాస్టర్లుగా నిలుస్తుంటే అతడి స్థానాన్ని రీప్లేస్ చేస్తూ కార్తీక్ ఆర్యన్ హిట్లు కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇప్పుడు హేరా ఫేరి లాంటి క్రేజీ ఫ్రాంఛైజీ కూడా అక్షయ్ ఛేజారడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. హేరా ఫేరి 3 కోసం అక్షయ్ కుమార్ స్థానంలో కార్తీక్ ఆర్యన్ ని చిత్రబృందం రీప్లేస్ చేసింది. కారణం ఏదైనా కానీ ఒక అగ్ర హీరోకి బ్యాక్ టు బ్యాక్ పంచ్ లు పడిపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అలాగే ఈ విషయాలేవీ అక్షయ్ కుమార్ అభిమానులకు అస్సలు డైజెస్ట్ కావడం లేదు. దీనిపై సోషల్ మీడియాల్లో తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉన్నారు.
అయితే ఈ క్రేజీ సీక్వెల్ నుంచి అక్షయ్ తప్పుకోవడానికి కారణమేమిటో ఆయనే స్వయంగా వెల్లడించారు. హేరా ఫేరి 3 స్క్రిప్ట్ అసంతృప్తిగా ఉంది.. అందుకే నటించలేదని సింపుల్ గా చెప్పాడు. అతని స్థానంలో కార్తీక్ ఆర్యన్ ని తీసుకోవడంపై ఇప్పటికి మౌనం వీడాడు. దీనిని బట్టి ఇకపైనా అక్షయ్ కుమార్ లేకుండానే హేరా ఫేరీ ఫ్రాంచైజీ ముందుకు సాగుతోందనేది ఖాయమైంది. మొదటి రెండు చిత్రాల స్టార్ మూడో భాగంలోను కొనసాగుతారని అభిమానులు ఆసక్తిగా వేచి చూడగా వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. కానీ ఈ మార్పు ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం లేదు.
కారణం ఏదైనా కానీ హేరా ఫేరి 3 గురించి అభిమానులు చాలా చర్చించుకున్నారు. సంవత్సరాల నిరీక్షణ తర్వాత బాబు రావు పాత్రను పోషిస్తున్న ఫ్రాంచైజీ స్టార్ పరేష్ రావల్ ట్విట్టర్ లో కార్తీక్ ఆర్యన్ త్రీక్వెల్ (పార్ట్ 3)లో భాగమవుతాడని ప్రకటించడమే గాక.. ఈ సినిమా లో అక్షయ్ కుమార్ స్థానంలో అతడు అడుగుపెడుతున్నాడని ధృవీకరించారు. ఇంకా ఈ సినిమాలో నటించే ఇతర తారాగణం ఎవరు? అన్నది ఇంకా మేకర్స్ ధృవీకరించలేదు. కానీ అక్షయ్ ఈ అద్భుత కామెడీ రైడర్ కోసం తిరిగి టీమ్ తో చేరకపోవడం చాలా మందిని కలవరపరిచింది. అక్షయ్ తిరిగి రావాలని డిమాండ్ చేస్తూ హేరా ఫేరి చిత్రాలలోని ఐకానిక్ కామెడీ సన్నివేశాలను గుర్తుచేస్తూ సోషల్ మీడియా షేరింగులతో వెబ్ హీటెక్కిపోతోంది. దీంతో హేరా ఫేరి 3లో ఎందుకు భాగం కాలేదు? అనే దానిపై అక్షయ్ మౌనం వీడాల్సి వచ్చింది.
స్క్రిప్ట్‌పై అసంతృప్తి కారణం:
తనకు ఆఫర్ చేసిన స్క్రిప్ట్ విషయంలో తాను అసంతృప్తిగా ఉన్నానని ఖిలాడీ కుమార్ చెప్పాడు. స్క్రిప్టు మొదట తన వద్దకు వచ్చిందని అయితే దానిని తిరస్కరించానని తెలిపాడు. అక్షయ్ మాట్లాడుతూ-``హేరా ఫేరి నాలో భాగం. చాలా మందికి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. నాక్కూడా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా మూడవ భాగం చేయనందుకు బాధపడ్డాను. మనం ప్రతిదీ విడి విడిగా చూడాలి. మీరు(అభిమానులు) వేరే విధంగా ఆలోచించడం ప్రారంభించండి. సినిమా నాకు ఆఫర్ చేసినా.. స్క్రీన్ ప్లే - స్క్రిప్ట్ విషయంలో నేను సంతోషంగా లేను. ప్రజలు నన్ను తిరిగి సీక్వెల్ లో చూడాలనుకుంటున్నా... నచ్చనిది చేయాలి!! అందుకే నేను వెనక్కి తగ్గాను. ఒక అడుగు వెనక్కి వేశాను`` అని తెలిపాడు.
అభిమానులకు క్షమాపణలు
హేరా ఫేరి 3లో అక్షయ్ స్థానంలో కార్తిక్ ఆర్యన్ వచ్చారని పరేష్ రావల్ ధృవీకరించిన తర్వాత సోషల్ మీడియా అంతటా అభిమానుల వ్యాఖ్యలతో నిండిపోయింది. ఖిలాడీ అక్షయ్ తిరిగి ఈ క్రేజీ ఫ్రాంచైజీలోకి రావాలని అభిమానులు డిమాండ్ చేసారు. దీంతో తన అభిమానులకు క్షమాపణలు చెబుతూ.. నా జీవితంలో భాగం అయిన ఈ మూవీలో నేను నటించనందుకు చాలా బాధపడ్డాను. కానీ సృజనాత్మక అంశాలతో నేను సంతోషంగా లేను. కాబట్టి నేను వెనక్కి తగ్గాను. నా అభిమానులకు కృతజ్ఞతలు.
నేను ట్విట్టర్ ట్రెండ్ లో `నో రాజు.. నో హేరా ఫేరీ` అనేది చదివాను. వారు (అభిమానులు) ఎంత హర్ట్ అయ్యారో చూసి నేను కూడా బాధపడ్డాను. ఇది బాధాకరమైన విషయం. నేను ప్రతి ఒక్కరికీ చాలా కృతజ్ఞుడను. నా అభిమానులు నన్ను చాలా ప్రేమిస్తారు. నాపై వారి క్రేజ్ అపరిమితంగా ఉంది. నేను హేరా ఫేరి 3 చేయనందుకు వారికి క్షమాపణలు చెబుతున్నాను`` అని అన్నారు. కారణం ఏదైనా కానీ ఇటీవలి కాలంలో స్క్రిప్టు విషయంలో అక్షయ్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడని అర్థమవుతోంది. కొన్ని వరుస పరాజయాలు అతడి మైండ్ సెట్ ని మార్చేశాయి. అదే క్రమంలో హేరా ఫేరి 3ని వదులుకున్నాడు. ఒకవేళ కార్తీక్ ఆర్యన్ ఈ ఫ్రాంఛైజీకి కూడా బ్లాక్ బస్టర్ ని అందిస్తే అక్షయ్ నిర్ణయం తప్పు అని నిరూపణ అయినట్టే. కానీ ఏం జరుగుతుందో వేచి చూడాలి. నెమ్మదిగా అక్షయ్ సినిమాలన్నిటిపైనా కార్తీక్ కర్చీఫ్ వేయడంపైనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.