Begin typing your search above and press return to search.
100కోట్ల సైడ్ ఇన్ కంతో కిలాడీ!
By: Tupaki Desk | 29 May 2019 1:25 PM GMTసినిమాల పారితోషికం వేరు.. వాణిజ్య ప్రకటనల ఆదాయం వేరు. అసలు కంటే కొసరుపైనే మోజెక్కువ! అదే తీరుగా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలంతా సినిమాలతో వచ్చే ఆదాయం కంటే కార్పొరెట్ బ్రాండ్ల ప్రమోషన్ తో వచ్చే ఆదాయం ఎంత? అన్నదానిపైనే గురి పెడుతున్నారు. దొరికినన్ని బ్రాండ్లను ఖాతాలో వేసుకుని డబుల్ ఎనర్జీని సంపాదిస్తున్నారు. ఖాన్ ల త్రయాన్ని మినహాయిస్తే బాలీవుడ్ లో ప్రకటనల ద్వారా భారీ వార్షికాదాయం ఆర్జించే స్టార్లుగా కిలాడీ అక్షయ్ కుమార్- రణవీర్ సింగ్- దీపిక పదుకొనే- అమితాబ్ బచ్చన్- వరుణ్ ధావన్- ఆలియాభట్ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు సైలెంట్ గా సైడ్ కోసేస్తున్నారట. సైడ్ ఇన్ కంని ఖాతాల్లో మళ్లించి డబుల్ ట్రిపుల్ గా ఆర్జిస్తున్నారని తెలుస్తోంది.
తాజాగా ఫ్రీ ప్రెస్ జర్నల్ విడుదల చేసిన ఓ సర్వేలో బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఆర్జించే టాప్ -1 హీరోగా కిలాడీ అక్షయ్ కుమార్ సంచలనం సృష్టించాడు. అతడి సైడ్ ఇన్ కం ఏకంగా ఏడాదికి 100 కోట్లు అని తెలుస్తోంది. అక్కీ తర్వాత రణవీర్ రూ. 84 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచాడు. ఆసక్తికరంగా రణవీర్ భార్యామణి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే రూ.72కోట్ల ఎర్నింగ్ తో మూడో స్థానంలో నిలిచింది. భర్తతోనే సంపాదనలో పోటీపడుతున్న బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ 4వ స్థానంలో ఉన్నారు.
ఇక కార్పొరెట్ ఉత్పత్తుల్ని ఖాతాలో వేసుకుంటున్న నేటి తరం స్టార్లుగా ఆలియా- వరుణ్ ధావన్ జోడీ పేర్లు టాప్ 10 జాబితాలో చేరాయి. ప్రకటనల ద్వారా ఆలియా ఏడాదికి 68 కోట్లు ఆర్జిస్తూ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కింగ్ ఖాన్ షారూక్ 56 కోట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఉన్నట్టుండి షారూక్ సక్సెస్ గ్రాఫ్ పడిపోవడంతో కార్పొరెట్ కంపెనీలు యువతరం వైపు చూస్తున్నాయని తాజా సన్నివేశం చెబుతోంది. ఆ క్రమంలోనే యంగ్ హీరో వరుణ్ ధావన్ షారూక్ తర్వాత 48 కోట్ల ఆదాయంతో ఏడో స్థానంలో నిలిచాడు. రూ. 40 కోట్లతో 8వ స్థానంలో సల్మాన్.. రూ. 32 కోట్లతో 9వ స్థానంలో కరీనా.. 30 కోట్ల సంపాదనతో 10వ స్థానంలో కత్రిన నిలిచారు. ఖాన్ లు టాప్ 10లో స్థానం సంపాదించుకున్నా.. మార్కెట్లో డౌన్ ఫాల్ కనిపిస్తోందని ఈ సర్వే తేల్చి చెబుతోంది.