Begin typing your search above and press return to search.
సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన 'లక్ష్మీబాంబ్'.. అంతపెద్ద రికార్డా!
By: Tupaki Desk | 29 May 2020 4:23 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న 'లక్ష్మీ బాంబ్' సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. మొదట్లో ఓటిటి రిలీజ్ కి నో చెప్పిన చిత్రయూనిట్.. ఇప్పుడు ఓటిటి లోనే భారీ రేంజ్ లో రిలీజ్ చేయాలనీ సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇక ఈ లక్ష్మిబాంబ్ సినిమాను జూన్ నెలలో డిజిటల్ రిలీజ్ గురించి చర్చలు జరిగాయి. మరి మొదట్లో థియేటర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పిన లారెన్స్ టీమ్ ఇప్పుడెందుకు ఓటిటి వైపు మొగ్గు చూపుతున్నారని నెటిజన్లు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత లాక్ డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదని భావించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా రూ.125 కోట్లకు అమ్ముడయ్యాయి. సాధారణంగా పెద్ద సినిమాలకు 60 - 70 కోట్ల వరకు చెల్లించేందుకు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థలు రెడీగా ఉన్నాయి. అయితే ఈ మూవీని ముందుగా 145 కోట్లకు ఓటీటీకి విక్రయించినట్లు ఓ వార్త సంస్థ తెలిపింది. ఆ తర్వాత 125 కోట్లకు నిర్మాతలు, హాట్స్టార్ మధ్య అగ్రిమెంట్ కుదిరిందని అదే సంస్థ పేర్కొంది. థియేటర్లలో విడుదలై వచ్చే కలెక్షన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తమని చెప్పుకొచ్చింది. ఈ విషయమే ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొదటిసారి ఓ సినిమా డిజిటల్ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోవడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో సినిమాలను విడుదల చేసేందుకు వీలు లేకపోవడంతో లక్ష్మీబాంబ్ నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేయనున్నారు. సౌత్ లో రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన కాంచన సినిమా భారీ హిట్. అందువల్ల ఈ చిత్రానికి భారీ ధర వచ్చినట్లు తెలుస్తుంది.