Begin typing your search above and press return to search.
బాబోయ్ ఒకే సారి పది సినిమాలు ఏంటీ బాసూ?
By: Tupaki Desk | 22 July 2021 6:19 AM GMTఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఆరు నుండి పది సినిమాల వరకు విడుదల చేసిన సందర్బాలు ఉన్నాయి. 2000 తర్వాత హీరోల సినిమాల సంఖ్య చాలా తగ్గింది. కొందరు హీరోలు ఏడాదికి కనీసం ఒక్కటి కూడా చేయలేక పోతున్నారు. అలాంటిది ఒక హీరో ఏడాదికి అయిదు ఆరు సినిమాలు విడుదల చేస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటితో పాటు మరో పది సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు. అందులో కొన్ని ఇప్పటికే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యాయి.. మరి కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని చర్చల దశలో ఉన్నాయి.
ఆ హీరో ఏదో చిన్నా చితకా సినిమాలను కమిట్ అవ్వడం లేదు.. అలాగే ఆయన ఓ చిన్న హీరో కాదు.. ఆయనే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఈయన హీరోగా ఎప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు తగ్గకుండా వస్తూనే ఉన్నాయి. ఈమద్య కాలంలో ఈయన నటించిన ప్రతి సినిమా వందల కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ హీరోలతో పోల్చినా కూడా ఈయన ఆదాయం ఓ రేంజ్ లో ఉంది.
సినిమా స్టార్స్ గా సంపాదిస్తున్న వారిలో అత్యధిక మొత్తంను సంపాదిస్తున్నది అక్షయ్ కుమార్ మాత్రమే అంటూ ఇటీవలే ఫోర్బ్స కూడా ప్రకటించింది. అలాంటి అక్షయ్ కుమార్ తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన సూరారై పోట్రూ సినిమా రీమేక్ కు కూడా ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.
సూర్య నటించిన సూరారై పోట్రూ సూపర్ హిట్ దక్కించుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లింది. ఈ సినిమా ను సూర్య బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. హిందీ వర్షన్ కు కూడా సుధ కొంగర దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇక చాలా రోజులుగా ఈ రీమేక్ లో నటించబోతున్నది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ రీమేక్ లో హృతిక్ రోషన్ నటించాలంటూ ఇటీవల ఒక సర్వేలో అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని మేకర్స్ మాత్రం ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ ను సంప్రదించారని.. అందుకు ఆయన ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.
అక్షయ్ కుమార్ కు ముందు మరో హీరోతో చర్చలు జరిపినా కూడా ఆయన నో చెప్పాడని.. దాంతో అక్షయ్ కుమార్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో లెక్కకు మించి సినిమాలు ఉన్నాయి. కనుక ఈ సినిమా ను ఎప్పటికి చేస్తాడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాని అక్షయ్ తన ప్రతి సినిమాను కూడా రెండు మూడు నెలల్లోనే పూర్తి చేస్తాడు. కనుక ఈ ఏడాదిలోనే సూరారై పోట్రూ సినిమా రీమేక్ పట్టాలు ఎక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.