Begin typing your search above and press return to search.
ప్యాడ్ మ్యాన్ టూ మిల్క్ మ్యాన్
By: Tupaki Desk | 12 Feb 2018 7:02 AM GMTసందేశాత్మక చిత్రాలంటే ఎవ్వరైనా ఈ రోజుల్లో నటించడానికి రెడీ అంటారు. కానీ అందరికి అనుకున్నట్టుగా ఆ కథలు సెట్ అవ్వడం కొంచెం కష్టమే. కానీ బాలీవుడ్ హీరోల్లో కొందరు మాత్రం అదే ఫార్మాట్ లో సినిమాలను చేస్తూ మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకుంటున్నారు. ముఖ్యంగా అలాంటి వారిలో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హీరో గత కొంత కాలంగా చేస్తోన్న చిత్రాలు చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి.
రీసెంట్ గా మహిళల గురించి వచ్చిన ప్యాడ్ మ్యాన్ సినిమా ఎట్టకేలకు హిట్ టాక్ ను సొంత చేసుకుంది. పోటీగా ఇతర సినిమాలు వచ్చినప్పటికి ప్యాడ్ మ్యాన్ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. అయితే ఈ సినిమా అందించిన విజయంతో అక్షయ్ మరో కొత్త తరహా కథకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాడాట. వర్గీస్ కురియన్ జీవిత కథలో ఈ బాలీవుడ్ హీరో కనిపించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఐ టు హేడ్ ఎ డ్రీమ్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.
దేశంలో పాల దిగుబడి కోసం ఎంతో కృషి చేసిన వర్గీస్ గురించి గత కొంత కాలంగా అనేక కథనాలు వచ్చాయి. అయితే కథలో మంచి పాజిటివ్ వైబ్రెషన్స్ ఉండడంతో టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ -బట్టీ గుల్ మీటర్ ఛాలు సినిమాల దర్శకుడు శ్రీ నారాయణ్ సింగ్ ఆ కథకు దర్శకత్వం వహించాలని డిసైడ్ అయ్యారట. ఇక ఏక్తా కపూర్ సినిమాని నిర్మించడానికి సిద్ధమైనట్లు టాక్.