Begin typing your search above and press return to search.

అక్ష‌య్ లాంటి స్టార్ కు ఇలాంటి ప‌రిస్థితా?

By:  Tupaki Desk   |   25 Feb 2023 7:00 AM GMT
అక్ష‌య్ లాంటి స్టార్ కు ఇలాంటి ప‌రిస్థితా?
X
గ‌త కొంత కాలంగా బాలీవుడ్ గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటూ వ‌స్తోంది. అమీర్ ఖాన్ లాంటి బాక్సాఫీస్ బాద్ షా న‌టించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. అప్పుడ‌ప్పుడు అజ‌య్ దేవ్ గ‌న్ లాంటి స్టార్ లు `దృశ్యం 2` లాంటి సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం వంద‌ల కోట్లు బాక్సాఫీస్ వ‌ద్ద రాబ‌ట్ట‌లేక‌పోతున్నాయి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ మళ్లీ విజ‌యాల బాట ప‌ట్టేనా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో షారుక్ షాక్ నటించిన `పఠాన్‌` విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. గ‌త కొంత కాలంగా ఏ బాలీవుడ్ మూవీ రాబ‌ట్ట‌ని వ‌సూళ్ల‌ని సొంతం చేసుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా హిందీ వెర్ష‌న్ 500 క‌ట్లు రాబ‌ట్ట‌గా ఇత‌ర భాష‌ల్లో క‌లిపి మొత్తం 1000 కోట్లు రాబ‌ట్టి అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన హిందీ సినిమాగా నిలిచింది. దీంతో బాలీవుడ్ ఇక లైన్ లో ప‌డిన‌ట్టే న‌ని అంతా భావించారు. బాలీవుడ్ వ‌ర్గాలైతే సంబ‌రాలు చేసుకున్నాయి.

ఇంత‌లోనే కార్తీక్ ఆర్య‌న్ న‌టించిన `షెహ‌జాదా` విడుద‌లై బాలీవుడ్ వ‌ర్గాల‌కు షాకిచ్చింది. తెలుగులో సంచ‌ల‌న విజ‌యాన్నిసొంతం చేసుకున్న `అల వైకుంఠ‌పుర‌ములో` మూవీకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ హిందీలో ఏ మాత్రం ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. కార్తిక్ ఆర్య‌న్ కెరీర్ లోనే భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది. ఇదిలా వుంటే ఈ శుక్ర‌వారం అక్ష‌య్ కుమార్‌, ఇమ్రాన్ హ‌ష్మీ క‌లిసి న‌టించిన `సెల్ఫీ` విడుద‌లైంది.

రిలీజ్ కు ముందు ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మ‌రీ దారుణంగా వున్నాయి. గురువారం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయ‌గా ఆశ్చ‌ర్య‌ప‌రిచే రీతిలో అడ్వాన్స్ బుకింగ్స్ న‌మోదు కావ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ని షాక్ కు గురిచేసింది. దేశ వ్యాప్తంగా 9000 టికెట్స్ మాత్ర‌మే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అక్ష‌య్ కుమార్ కు నిజంగా ఇది అవ‌మాన‌మే. `పఠాన్‌` 31వ రోజు టికెట్ లు 13000 అమ్ముడు పోగా అక్ష‌య్ సినిమాని ప‌ట్టించుకునే వారే లేక‌పోవ‌డం షాక్ కు గురి చేస్తోంది.

ఇదే స‌మ‌యంలో ఆయుష్మాన్ ఖురానా న‌టించిన `డాక్ట‌ర్ జి` అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 18 వేల టికెట్ లు అమ్ముడు పోవ‌డం విశేషం. అంటే అక్ష‌య్ క్రేజ్ భారీ స్థాయిలోత‌గ్గిపోయింద‌ని తాజా అడ్వాన్స్ బుకింగ్స్ తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ట్రేడ్ వ‌ర్గాలు మాత్రం `సెల్ఫీ` తొలి రోజు 5 కోట్ల వ‌ర‌కైనా రాబ‌ట్టే అవ‌కాశం వుంద‌ని అంటున్నాయి. అక్ష‌య్ కుమార్ అండ్ టీమ్ ఈ మూవీ కోసం భారీ స్థాయిలో ప్ర‌మోష‌న్స్ ని నిర్వ‌హించింది. 3 నిమిషాల్లోనే అత్య‌ధిక సెల్ఫీల‌తో అక్ష‌య్ గిన్నిస్ రికార్డు సృష్టించి హాట్ టాపిక్ అయ్యాడు కూడా. అయితే ఈ జిమ్మిక్కులేవీ `సెల్ఫీ` అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలో ప‌ని చేయ‌క‌పోవ‌డం మేక‌ర్స్ ని షాక్ కు గురి చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.