Begin typing your search above and press return to search.
2018లో 700 కోట్ల హీరో!!
By: Tupaki Desk | 9 Feb 2018 11:28 AM GMTఇండియన్ సిల్వర్ స్క్రీన్ మార్కెట్ లో ఈ ఏడాది టాప్ ప్లేస్ లో ఏ హీరో ఉన్నాడు అనే విషయానికి వస్తే..ఒక బాలీవుడ్ హీరో 2018 మొత్తాన్ని ముందే కవర్ చేశాడని చెప్పవచ్చు. దాదాపు 700 కోట్ల మార్కెట్ లో ఈ హీరో పెరు వినబడుతోంది. అయితే ఇంకా 2018 అయిపోలేదు కదా అప్పుడే క్యాలిక్యులేషన్స్ ఏంటని అనే అనుమానం రావచ్చు. కానీ అక్షయ్ చేస్తోన్న సినిమాల లిస్ట్ చూస్తే నిజమే కాదా అని అనకుండా ఉండలేము.
ఎలాంటి కథ అయినా సరే..నలుగురు ఇంతవరకు చేయని కథ ఇది అని తెలిస్తే చాలు అక్షయ్ వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక సమాజానికి ఉపయోగపడే కథలు మనోడి చెవిన పడాలే గాని అస్సలు వదిలిపెట్టడు. అవసరం అయితే మార్పులు చేయించి రెమ్యునరేషన్ తగ్గించుకొని అయినా సినిమాని పట్టాలెక్కించేస్తాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. మాన్ హీరో చేయబోయే సినిమాల బాక్స్ ఆఫీసు లెక్కలను ఒకసారి చూస్తే.. ప్యాడ్ మ్యాన్ ఈ శుక్రవారమే రిలీజ్ అయ్యింది.
అది 80 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయ్యింది.. గోల్డ్ అనే మరో ప్రయోగాత్మకమైన సినిమా 70 కోట్లతో. ఆ తరువాత కేసరి 55 కోట్లు - హౌస్ ఫుల్ 4 100 కోట్ల బిజినెస్. ఇక ఫైనల్ గా మరో మెయిన్ కథ 2 పాయింట్ ఓ. ఆ సినిమా దాదాపు 400 కోట్ల మార్కెట్ లో రిలీజ్ కానుంది. బడ్జెట్ కూడా అంతే అని అందరికి తెలిసిందే. ఆ సినిమాలో అక్షయ్ విలన్ నటించిన సంగతి తెలిసిందే. విడుదలపై ఆ సినిమా కాస్త అటు ఇటు కదలాడుతున్నా సినిమా తప్పకుండా రిలీజ్ అయ్యాక రికార్డుల స్థాయిలో కలెక్షన్స్ ని అందుకోవడం కాయంగా కనిపిస్తోంది. ఇక ఈ విధంగా మనోడి మొత్తం మార్కెట్ రూ.700 కోట్లు దాటిందన్నామాట. అది సంగతి.