Begin typing your search above and press return to search.
మనోడి వరుస డిజాస్టర్స్.. ఐనా హాలీవుడ్ స్టార్స్ కంటే ముందే!
By: Tupaki Desk | 24 Aug 2022 5:55 AM GMTబాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో తెల్సిందే. వందల కోట్లు పెట్టి నిర్మించిన సినిమాలు కనీసం పాతిక కోట్ల వసూళ్లను కూడా బాక్సాఫీస్ వద్ద రాబట్టలేక పోతున్నాయి. ఇటీవల వచ్చిన లాల్ సింగ్ చడ్డా... సామ్రాట్ పృథ్వీరాజ్.. రక్షాబంధన్.. ఇలా చాలా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. గతంలో ఫ్లాప్ అయినా మినిమం వసూళ్లు సాధించేవి.. కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలైనా చిల్లర కూడా రావడం లేదంటూ బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పారితోషికం విషయంలో హాలీవుడ్ స్టార్స్ ను కూడా పక్కకు నెట్టివేశాడు. ఫోర్బ్స్ జాబితా అనుసారంగా అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోల జాబితాలో వరల్డ్ లో నెం.2 గా అక్షయ్ కుమార్ నిలిచాడు. సినిమాల ద్వారా అక్షయ్ కుమార్ సంపాదన 48.5 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 390 కోట్ల రూపాయలు అన్నమాట.
హాలీవుడ్ స్టార్స్ కూడా అక్షయ్ కుమార్ తర్వాతే నిలిచారు. అక్షయ్ కుమార్ ఏడాదికి అయిదు నుండి పది సినిమాలకు కమిట్ అవుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సినిమా సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటున్న కారణంగా అక్షయ్ కుమార్ ఈ స్థాయి సంపాదన కలిగి ఉన్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పారితోషికం విషయంలో... సంపాదన విషయంలో అక్షయ్ కుమార్ టాప్ లో ఉన్నాడు కానీ ఈ మధ్య కాలంలో ఈయన సక్సెస్ రేటు మరీ దారుణంగా పడిపోయింది. ఈయన సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవ్వడానికి భయపడి ఓటీటీ వైపు వెళ్తున్నాయి అంటే ఈయన సినిమాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
వరుసగా డిజాస్టర్స్ పడుతున్నా కూడా ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో మరో అరడజను సినిమాలు ఉన్నాయి. వరుసగా వాటిని చేస్తూనే ఉంటాడు. మళ్లీ కొత్త సినిమాలకు కమిట్ అవుతూనే ఉన్నాడు. సినిమాల ఫలితం తో సంబంధం లేకుండా అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమాల సంఖ్య అమాంతం పెరిగి పోతూనే ఉంది.
బాలీవుడ్ లోనే కాకుండా ఏ సినిమా పరిశ్రమలో కూడా హీరోలో ఈ స్థాయిలో సినిమాలు చేస్తున్నది లేదు.. ఆ స్థాయి పారితోషికం అందుకుంటున్నది లేదు. అందుకే అక్షయ్ కుమార్ హాలీవుడ్ స్టార్స్ కంటే కూడా అధికంగా సంపాదన కలిగి ఉన్నాడు అనడం లో సందేహం లేదు.