Begin typing your search above and press return to search.

ఆ హీరో కొత్త లుక్ షాకింగే..

By:  Tupaki Desk   |   3 July 2017 6:33 AM GMT
ఆ హీరో కొత్త లుక్ షాకింగే..
X
బాలీవుడ్లో ఖాన్ హీరోల ఆధిపత్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మూడు దశాబ్దాల నుంచి అక్కడ వాళ్లదే హవా. ఐతే ఆ హీరోల స్థాయిలో వసూళ్లు రాబట్టకపోయినా.. నిలకడగా హిట్లు కొడుతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ.. తన స్థాయిలో భారీ వసూళ్లే రాబడుతూ అంతకంతకూ తన విలువను పెంచుకుంటూ వెళ్తున్నాడు అక్షయ్ కుమార్. గత కొన్నేళ్లలో అతడి స్టేచర్ బాగా పెరిగింది. పోయినేడాది ‘ఎయిర్ లిఫ్ట్’.. ‘రుస్తుమ్’.. ఈ ఏడాది ‘జాలీ ఎల్ ఎల్బీ-2’ సినిమాలతో హిట్లు కొట్టడమే కాదు.. ప్రేక్షకుల్లో గౌరవభావం సంపాదించుకున్నాడు అక్షయ్.

త్వరలోనే ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ అనే వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న అక్షయ్.. తాజాగా మరో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. అమీర్ ఖాన్‌ తో ‘తలాష్’ లాంటి డిఫరెంట్ థ్రిల్లర్ ను రూపొందించిన లేడీ డైరెక్టర్ రీమా కగ్తి డైరెక్షన్లో అక్షయ్ ‘గోల్డ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందుకోసం అక్షయ్ ఎత్తిన అవతారం చూస్తే షాకైపోవాల్సిందే. ‘బాంబే వెల్వెట్’లో రణబీర్ కపూర్ ను గుర్తుకు తెచ్చేలా ఉంది ఈ లుక్. ఇది చాలా పాత కాలం నాటి నేపథ్యంలో సాగే సినిమా అని ఈ లుక్ చూస్తే స్పష్టమవుతోంది. మీసం సంగతి పక్కన పెట్టేస్తే చార్లీ చాప్లిన్ ను కూడా గుర్తుకు తెస్తున్నాడు అక్షయ్. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. స్వాతంత్ర్యం తర్వాత భారత్ సాధించిన తొలి ఒలింపిక్ పతకానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/