Begin typing your search above and press return to search.
లారెన్స్ కిలాడీతోనే పెట్టుకున్నాడా?
By: Tupaki Desk | 21 May 2019 9:11 AM GMTఏదైనా సినిమా హీరోకి దర్శకుడికి మధ్య పొరపొచ్చాలు వస్తే ఇక ఆ ప్రాజెక్టు ముందుకెళుతుందా? కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఒక్కోసారి అపార్థాలు తలెత్తుతాయి. ఇక క్రియేటివిటీ పరంగా డిఫరెన్సెస్ వస్తే ఇక ఆ సినిమా షూటింగ్ ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ప్రస్తుతం `కాంచన` హిందీ రీమేక్ అలాంటి సందిగ్ధావస్థలోనే ఉంది. ఈ సినిమాకి టైటిల్ `లక్ష్మీ బాంబ్` అంటూ ఘనంగా ప్రకటించారు. అయితే టైటిల్ సహా ఫస్ట్ లుక్ ఎనౌన్స్ మెంట్ తనకు తెలియకుండానే చేసేశారని లారెన్స్ అలకబూనిన సంగతి తెలిసిందే. గౌరవం లేని చోట నేను ఉండలేను!! అంటూ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆత్మ గౌరవాన్ని మించినది వేరొకటి లేనే లేదని లారెన్స్ చాలా క్లియర్ కట్ గా తన నిర్ణయాన్ని ప్రకటించి పెద్ద షాకిచ్చాడు.
దీంతో లక్ష్మీ బాంబ్ పై ఆరంభమే బాంబ్ పడింది. ఒక ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు తప్పుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినట్టే. కోలుకోలేనంత పెద్ద దెబ్బ అది. అయితే లారెన్స్ కి ఎవరితో విభేధాలు? అంటే కచ్ఛితంగా అన్ని వేళ్లు కిలాడీ అక్షయ్ కుమార్ వైపే చూపిస్తున్నాయి. తన సినిమా ఫస్ట్ లుక్ ని తనే దగ్గరుండి లాంచ్ చేశాడు. అంటే లారెన్స్ కి ఎందుకు అతడు ప్రాధాన్యతనివ్వలేదు. అంటే అంతకు ముందు నుంచే ఇద్దరి మధ్యా ఏదో గ్యాప్ నడుస్తోందనే దానర్థం. అది ఫస్ట్ లుక్ తోనే బయటపడిపోయింది. ఇక అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన లారెన్స్ ఇక పూర్తిగా అన్నివిధాలా ఓపెన్ అయిపోయారు.
లారెన్స్ తప్పుకున్నారు సరే? ప‌్రస్తుతం ఈ సినిమాని టేకప్ చేసే కొత్త దర్శకుడు ఎవరు? ఇంతకీ షూటింగ్ ఎక్కడి వరకూ వచ్చింది? అంటే ఇదీ వివరం. లారెన్స్ మాస్టార్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించగానే యుద్ధ ప్రాతిపదికన ఈ ఆదివారం నాడు నిర్మాతలు తుషార్ - షబీనా ఇద్దరితో అక్షయ్ అత్యవసర మీటింగ్ ని ఏర్పాటు చేసి దీనిపై చర్చించారట. మరో కొత్త దర్శకుడిని వెతకాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ లోనే సినిమా మొదలెట్టి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. కొన్ని సీన్లతో పాటు బిస్మిల్లా అనే పాటను తెరకెక్కించారు. ఇక రెండో షెడ్యూల్ కి వెళ్లాలనుకుంటుండగా లారెన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఇకపై కొత్త దర్శకుడిని ఫైనల్ చేసి తిరిగి సెప్టెంబర్ లోనే రెండో షెడ్యూల్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అప్పుడు మారథాన్ తరహా షూట్ చేయాలని 40 రోజుల కాల్షీట్లను కిలాడీ కేటాయించారట. 2020 జూన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఆరంభమే నిర్ణయించారు.