Begin typing your search above and press return to search.
‘2.0’ కోసం మేకప్ వేస్తుంటే.. సినిమాలు చూస్తూ..
By: Tupaki Desk | 21 Nov 2016 9:40 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ కు విలన్ గా అక్షయ్ కుమార్. అసలెవ్వరూ ఊహించని కాంబినేషన్ ఇది. వీళ్లిద్దరూ కలిసి నటించడమే విచిత్రమంటే.. ఇక రజినీకి అక్షయ్ కుమార్ విలన్ అన్నది అస్సలు ఊహించలేదెవ్వరూ. మరోవైపు అక్షయ్ కుమార్ కు విలన్ వేషం అసలు సూటవుతుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. ఐతే ‘2.0’లో అక్షయ్ లుక్ చూశాక.. ఆ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. హాలీవుడ్ సినిమాల్లో విలన్లను గుర్తుకు తెచ్చేలా భయంకరమైన అవతారంలో దర్శనమిచ్చాడు అక్షయ్. నిన్న రిలీజ్ చేసిన మూడు ఫస్ట్ లుక్ పోస్టర్లలో అక్షయ్ కుమార్ దే ‘ది బెస్ట్’ అనడంలో సందేహాల్లేవు. అంత ఇంటెన్సిటీ ఉంది ఆ లుక్ లో.
ఈ పాత్ర కోసం కెరీర్లో ఎన్నడూ పడనంత కష్టం పడ్డాడట అక్షయ్ కుమార్. ‘2.0’ షూటింగ్ జరిగినన్నాళ్లూ.. మామూలుగా అక్షయ్ లేచే సమయానికి 6 గంటల ముందు లేవాల్సి వచ్చేదట. అందుకే ‘2.0’కు హీరో తాను కాదని.. అక్షయ్ కుమారే అని.. అతడి కమిట్మెంట్ కు హ్యాట్యాఫ్ అని అన్నాడు రజినీకాంత్. ఇక ఈ సినిమాలో నటించిన అనుభవం గురించి అక్షయ్ చెబుతూ.. ‘‘నా కెరీర్లో నేను ఎప్పుడూ పెద్దగా మేకప్ వేసుకోలేదు. సింపుల్ మేకప్ తోనే సినిమాలు చేసేవాడిని. కానీ ఈ సినిమాకు కేటాయించిన సమయంలో సగం మేకప్ కే సరిపోయింది. రోజూ కనీసం మూడు గంటలైనా మేకప్ వేసేవాళ్లు. ఆ మేకప్ వేస్తున్న టైంలో నేను ఎన్ని సినిమాలు చూశానో లెక్కలేదు’’ అని అక్షయ్ పేర్కొన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/