Begin typing your search above and press return to search.

కమల్ కోసం బాలీవుడ్ విలన్ ను సెట్ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   17 Jan 2019 11:19 AM IST
కమల్ కోసం బాలీవుడ్ విలన్ ను సెట్ చేస్తున్నాడు
X
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రజనీకాంత్ తో '2.0' తర్వాత కమల్ హాసన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 1994 లో సూపర్ హిట్ గా నిలిచిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈమధ్యే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసిన శంకర్ త్వరలో ఫోకస్ పెడుతున్నానని వెల్లడించాడు.

తాజాగా ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు శంకర్ అక్షయ్ కుమార్ ను ఎంచుకున్నాడట. '2.0' సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. నిజానికి రజనీ పాత్ర కంటే అక్షయ్ కుమార్ పోషించిన పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు పని చేసిన తర్వాత శంకర్ వర్క్ తో ఇంప్రెస్ అయిన అక్షయ్ మంచి పాత్ర ఉంటే మరోసారి కలిసి పనిచేద్దామని అన్నాడట. 'ఇండియన్ 2' లో మొదట విలన్ పాత్రకు అజయ్ దేవగణ్ ను అనుకున్నాడట శంకర్. కానీ అయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు అక్షయ్ కుమార్ నే సంప్రదించాడని సమాచారం.

అంతా సవ్యంగా జరిగితే ఇండియన్ కు కెనడియన్ విలన్ సెట్ అవుతుడాన్నమాట. ఏంటి అర్థం కాలేదా? కొంతమందికే తెలిసిన విషయం ఏంటంటే అక్షయ్ కుమార్ కు ఇండియన్ సిటిజెన్ షిప్ లేదు. అయన కెనడియన్. డౌట్ ఉంటే వికీపీడియా చూడండి!