Begin typing your search above and press return to search.
'పీఎం కేర్స్ ఫండ్'కు అక్షయ్ కుమార్ భారీ విరాళం
By: Tupaki Desk | 28 March 2020 4:01 PM GMTప్రస్తుతం కరోనా మహమ్మారి పంజా విసురుతున్న దేశాల ఆర్థిక స్థితి అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్ వంటి అత్యధిక జనాభా ఉన్న దేశాలలో కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా కట్టడికి భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ కు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సహాయక చర్యలకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సినీ తారలు తమ వంతు విరాళాలిచ్చారు. ఈ క్రమంలోనే కరోనా సహాయక చర్యల కోసం ప్రధాని మోడీ 'పీఎం కేర్స్ ఫండ్' పేరుతో విరాళాల సేకరణ ప్రారంభించారు. ప్రధాని పిలుపునకు స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్....ఆ నిధికి భారీ విరాళమిచ్చారు. కరోనాపై పోరాటంలో తన వంతుగా రూ.25 కోట్లను 'పీఎం కేర్స్ ఫండ్'కు విరాళమిస్తున్నానని అక్కీ ట్వీట్ చేశాడు. గొప్ప పని చేశావంటూ అక్షయ్ కుమార్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపిస్తూ రీట్వీట్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి తెలియని వారుండరు. బాలీవుడ్ లో గాడ్ ఫాదర్ లేకుండా...నెపోటిజం ఛాయలు పడకుండా స్టార్ హీరోగా అంచెలచలుగా కష్టపడి ఎదిగిన అసలు సిసలు హీరో అక్కీ. విలక్షణ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం బాద్షాలుగా బాలీవడ్ ను ఏలుతున్న సమయంలో....విలక్షణ కథాంశాలతో వరుస హిట్ సినిమాలు చేశాడు అక్సయ్. టాయిలెట్, ప్యాడ్ మ్యాన్, గోల్డ్, రుస్తుం వంటి సందేశాత్మక, దేశభక్తి చిత్రాలలో నటిస్తూనే బాక్సాఫీస్ ను కొల్లగొట్టాడు. సంపాదనే కాకుండా సామాజిక కార్యక్రమాలలోనూ అక్కీ ముందుంటాడు. ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్న అక్షయ్...పలు అంశాలపై తన వంతుగా ప్రజలను చైతన్య పరుస్తుంటాడు. తాజాగా కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరులోనూ అక్కీ నేను సైతం అన్నాడు. ప్రధాని ఇచ్చిన పిలుపునకు వెంటనే స్పందించి 'పీఎం కేర్స్ ఫండ్'కు రూ.25 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. ఇంత భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన తొలి బాలీవుడ్ హీరో అక్షయ్ కావడం విశేషం. ఇది మన ప్రజల జీవితాలని కాపాడుకోవలసిన సమయమని, మనకి తోచినంత సాయం చేయాలని కోరుతున్నానని అక్కీ ట్వీట్ చేశాడు. తన వంతు విధిగా 'పీఎం కేర్స్ ఫండ్'కు రూ.25 కోట్ల విరాళాన్ని అందిస్తున్నానని, ప్రాణం ఉంటే ప్రపంచం ఉన్నట్లేనని.. మనల్ని మనం రక్షించుకుందాం..అని అక్షయ్ చేసిన ట్వీట్ ఎందరికో స్ఫూర్తిదాయకం.