Begin typing your search above and press return to search.
వివాదాల వలలో అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' సినిమా..!
By: Tupaki Desk | 15 Jun 2021 12:30 AM GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో హిస్టోరికల్ మూవీస్ రూపొందిన ప్రతిసారి ఏదొక విధంగా వివాదాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇదివరకు పాపులర్ పద్మావత్.. మణికర్ణిక లాంటి సినిమాలకు వ్యతిరేకంగా సమస్యలను లేవనెత్తిన తరువాత కర్ణి సేన ఇప్పుడు పృథ్వీరాజ్ సినిమాను సవాలు చేస్తోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ - మిస్ వరల్డ్ మనుషి చిల్లర్ ప్రధానపాత్రల్లో నటించారు. డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మించారు. అయితే ఈ సినిమా కొద్దీ రోజులుగా కర్ణి సేన నుండి వివాదాలు ఫేస్ చేస్తోంది.
అయితే పృథ్వీరాజ్ అనే టైటిల్ సూచించినట్లుగా.. మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన హిస్టోరికల్ మూవీ ఇది. తాజా నివేదికల ప్రకారం.. ఈ మూవీ టైటిల్ మార్చాలని కర్ణి సేన యూత్ వింగ్ అధ్యక్షుడు సుర్జీత్ సింగ్ రాథోడ్ ఇటీవలే డిమాండ్ చేశారు. "ఈ సినిమా గొప్ప పృథ్వీరాజ్ చౌహాన్ మహారాజ్ జీవితం ఆధారంగా నిర్మించినప్పుడు వారు సినిమా టైటిల్‌ను కేవలం పృథ్వీరాజ్ గా ఎలా పెడతారు..? టైటిల్‌ను మహారాజ్ పూర్తి పేరుకు మార్చి ఆయనకు సరైన గౌరవం ఇవ్వాలని" కోరుతూ డిమాండ్ చేశారు.
తాజాగా ఈ సినిమా పై క్షత్రియ సేన వివాదం రేపుతోంది. ఎందుకంటే పృథ్వీరాజ్ మహారాజ్ కూడా ఓ క్షత్రియుడు. ఆయన జీవితంలో ఓటమి ఎరుగని మనిషి. అలాగే చివరి హిందూ సామ్రాట్ అంటూ చెబుతున్నారు. అయితే ప్రస్తుతం క్షత్రియులు కూడా ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరం తెలిపారు. అలాగే చౌహన్ అనే పేరు మెన్షన్ చేస్తూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహన్ అనే టైటిల్ పెట్టాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారట. అదేవిధంగా మరోవైపు ఈ రెండు బృందాలు కూడా చిత్రాన్ని అధికారికంగా విడుదల చేయడానికి ముందే తమకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకు సంజయ్ లీలా భన్సాలీ ఎదుర్కొన్న విధంగానే పృథ్వీరాజ్ మేకర్స్ కూడా కంగారు పడుతున్నారు. మరి 2019లో ప్రకటించిన ఈ సినిమా 2021 నవంబర్ 5న దీవాలి కానుకగా రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..!