Begin typing your search above and press return to search.

'పృథ్వీరాజ్' ట్రైలర్: భారతదేశపు ధైర్యవంతుడైన శౌర్య చక్రవర్తి కథ..

By:  Tupaki Desk   |   9 May 2022 8:30 AM GMT
పృథ్వీరాజ్ ట్రైలర్: భారతదేశపు ధైర్యవంతుడైన శౌర్య చక్రవర్తి కథ..
X
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక చిత్రం ''పృథ్వీరాజ్''. 12వ శతాబ్దంలో భారతదేశపు ధైర్యవంతులైన చక్రవర్తుల్లో ఒకరైన సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

'పృథ్వీరాజ్' చిత్రాన్ని జూన్ 3వ తారీఖున తెలుగు తమిళ హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇది 'ఉత్తరాధికారి బంధు రీత్యా కాదు.. యోగ్యతతో ఎంచుకోబడతారు..' అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది.

శౌర్యానికి వీరత్వానికి ప్రతీక అయిన పృథ్వీరాజ్ చౌహాన్ (అక్షయ్ కుమార్) ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత శత్రువుల నుంచి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు ఢిల్లీపై 17 సార్లు దండెత్తిన మహ్మద్ ఘోరీకి ఎదురు నిలిచి ఎలా తన సామ్రాజ్యాన్ని కాపాడుకున్నాడు? ఇందులో తనకు ఎవరెవరు తోడుగా నిలిచారు? మధ్యలో అతని ప్రేమ వంటి విషయాలను 'పృథ్వీరాజ్' సినిమాలో చూపించబోతున్నారు.

'ధర్మం కోసమే జీవించారు. ధర్మం కోసం మరణిస్తాను' అని అక్షయ్ చెప్పే డైలాగ్ పృథ్వీరాజ్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. ఇందులో అక్షయ్ కుమార్ సరసన మానుషీ చిల్లర్ కథానాయికగా నటించారు. 2017 మిస్ ఇండియాగా నిలిచిన మానుషీకి ఇది డెబ్యూ మూవీ. సంజయ్ దత్ - సోనూ సూద్ - అశుతోష్ రానా - మానవ్ విజ్ - సాక్షి తణ్వార్ కీలక పాత్రలు పోషించారు.

'పృథ్వీరాజ్' ట్రైలర్ చూస్తుంటే 'జోధా అక్బర్‌' 'బాజీరావ్‌ మస్తానీ' 'పానిపట్‌' తరహాలో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారని తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ లోనూ భారీ సెట్స్ - వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు - వీరోచిత పోరాటాలతో భారీతనం కనిపిస్తుంది. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

యాక్షన్‌ సీక్వెన్స్‌ మరియు విజువల్స్ గ్రాండ్‌ గా ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ప్రభావం చూపలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. శంకర్ - ఎహసాన్ - లాయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నాయి. అదే సమయంలో 'పుష్ప' 'RRR' 'కేజీయఫ్ 2' వంటి సౌత్ సినిమాలు భారీ వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు ''పృథ్వీరాజ్'' ఆ సినిమాల రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.