Begin typing your search above and press return to search.
చడ్డా Vs అక్కీ: రెండంకెల ఓపెనింగ్ అయినా తెస్తారా?
By: Tupaki Desk | 10 Aug 2022 2:30 AM GMTఈ ఏడాది బాలీవుడ్ రిలీజ్ లకు బిగ్ డే వచ్చేసింది. ఏదైనా భారీ ఓపెనింగుతో సంచలనం సృష్టించిన రోజు గురించి మాట్లాడుకుని చాలా కాలమే అయ్యింది. భూల్ భూలయ్యా 2 చాలా కాలానికి ఫర్వాలేదనిపించే ఓపెనింగ్ తెచ్చింది. అప్పటి నుండి ఒక హిందీ చిత్రానికి రెండంకెల ఓపెనింగ్ తేవడం కష్టంగా మారింది. బచ్చన్ పాండే - షంషేరా చిత్రాలకు మాత్రమే రెండంకెల ఓపెనింగ్ వచ్చింది.
అసలు విషయానికి వస్తే చాలా కాలంగా రూ. 20 కోట్లు పైగా తేవడం హిందీ సినిమాల ఓపెనింగ్ ల్లో గత చరిత్రగా మాత్రమే కనిపిస్తున్నాయి. చివరిగా సూర్యవంశీ రూ. 26.29 కోట్లు స్కోర్ చేసింది. అయితే ఇది పండగ రిలీజ్ కాబట్టి సాధ్యమైంది. ఈ చిత్రం 2021 దీపావళికి విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ అంతటి ఓపెనింగ్ లేదు.
ఈనెల 11న వస్తున్న వాటిలో అక్షయ్ నటించిన `రక్షా బంధన్`... అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` పైనే అన్ని కళ్లూ ఉన్నాయి. ఈ పెద్ద సినిమాల రాక చాలా కీలకంగా మారింది. ఇవి పెద్ద ఓపెనింగులు తెస్తాయనేది ఒక ఆశ. అందుకే వీటిపై అందరి దృష్టి నిలిచి ఉంది.
ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్ వద్ద సౌత్ దే హవా. KGF: చాప్టర్ 2 (హిందీ) రూ. రూ. 50 కోట్లు .. RRR (హిందీ) రూ. 20 కోట్ల మార్క్ తో పండుగేతర రిలీజ్ లలో దుమ్ము రేపాయి. మళ్లీ హిందీ బాక్సాఫీస్ వద్ద అంత ఊపు లేదు. అందుకే ఈసారి భారీ స్ట్రెయిట్ హిందీ సినిమాల విడుదలల కోసం ఈ గురువారం పాక్షిక సెలవుదినం కలిసొస్తుందని కూడా భావిస్తున్నారు. ఈ రెండూ కుటుంబ ప్రేక్షకుల కోసం వస్తున్న సినిమాలు.
ఈ రెండూ కలిపి ఓపెనింగ్ రూ. 30 కోట్లు వరకూ తెస్తాయని అంచనా. అంటే ఒక్కో సినిమా కనీసం 15 కోట్ల ఓపెనింగుతో అయినా ప్రారంభమవ్వాలి. తాజా ట్రేడ్ లెక్కలను బట్టి అది కనీస అంచనా. ఒకవైపు లాల్ సింగ్ చడ్డాకు ఎక్కువ సంఖ్యలో స్క్రీన్ లు అధిక ధర టిక్కెట్ లు కలిసొస్తాయని భావిస్తున్నారు. మరోవైపు రక్షా బంధన్ కి ఎక్కువ సంఖ్యలో థియేటర్లు అందుబాటులో ఉన్నందున ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనే చర్చ సాగుతోంది. అయితే డే -వన్ వసూళ్లను నిర్ధారించడం కష్టం. సింగిల్ స్క్రీన్ లు చిన్న సెంటర్ లలో అక్షయ్ మూవీ మెరుగైన రిజల్ట్ నిస్తుందని అంచనా.
ఓవరాల్ గా యుద్ధ భూమిలో ఎవరి సత్తా ఎంత? అన్నది వేచి చూడాలి. ఉదయం నుండి మధ్యాహ్నం షోల వరకు పరిస్థితులు ఎలా మారతాయనే దానితో సంబంధం లేకుండా రెండు చిత్రాలకు ఈవినింగ్ - లేట్ నైట్ షోల కలెక్షన్లను తెచ్చే ప్లాన్ చేసారట. రెండు భారీ చిత్రాల నడుమ పోటీలో ఎవరి సత్తా ఎంత? అన్నది వేచి చూడాలి. రూ.20 కోట్లు అంతకుమించి ఓపెనింగులు తెస్తారా లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.