Begin typing your search above and press return to search.
శంకర్ క్రియేటివిటీని నాశనం చేశారు!!
By: Tupaki Desk | 5 Jun 2016 7:30 AM GMTహౌస్ ఫుల్ 3 సినిమా.. ఇప్పటికే బీభత్సమైన రాడ్డు అంటూ మనం చెప్పుకున్నాం. కాని కామెడీ ఏంటంటే.. ఈ దారుణమైన సిల్లీ కామెడీ తొలి రోజున 15 కోట్లు వసూలు చేసింది. ఆ లెక్కన చూస్తే.. రానున్న రోజుల్లో బాగానే కూడబెట్టేసే ఛాన్సుంది. ఇక ఈ సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం.. శంకర్ తెలివితేటలను క్రియేటివిటీని రాజమౌళి ఒక్క సీన్లో వాడుకుంటే.. వీరు సినిమా అంతా వాడేసి నాశనం చేశారు అంటున్నారు.
'అపరిచితుడు' సినిమా ద్వారా తొలిసారి స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ పై ఒక ప్రయోగం చేశాడు శంకర్. ఆ సినిమాలో ఒకే మనిషిలోకి మూడు రకాలు పర్సనాలిటిలు ఎంటరై.. వారు చేసి విన్యాశాలను అద్భుతంగా పలికించాడు విక్రమ్. ఇదే కాన్సెప్టుతో రాజమౌళి 'ఛత్రపతి' సినిమాలో స్పూఫ్ కామెడీ చేశాడు కూడా. ఇప్పుడు ఆ రోల్ ను ఏకంగా ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ గా హీరో అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్ 3' సినిమాలో చేశాడు. ఏదో ఒకటి రెండు సీన్లంటే ఓకె కాని.. అపరిచితుడు క్లయ్ మ్యాక్స్ తరహా సీన్లను పదే పదే చేసి.. రచ్చ చేసి పాడేశాడు అక్కీ. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అవి చూస్తే చికాకే వస్తుంది. పైగా శంకర్ క్రియేట్ చేసిన ఒక గొప్ప వర్కును మరీ దారుణంగా ఎగతాళి చేసినట్లు అనిపిస్తుంది కూడా.
కాని ఎటువంటి సినిమాలైతే తెలుగు ప్రేక్షకులకు నచ్చవో.. అవే హిందీలో ఆడేస్తుంటాయి. ఆ మధ్యన కంటెంట్ ఏ మాత్రం లేని 'బాగి' సినిమా ఎలాగైతే ఆడేసిందో.. ఇప్పుడు హౌస్ ఫుల్ 3 కూడా అలాగే రన్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.