Begin typing your search above and press return to search.
తనకు మతం లేదన్న హీరో.. ఇండియన్ మాత్రమేనట!
By: Tupaki Desk | 9 March 2020 5:56 AM GMTతనకు ఏ మత పట్టింపూ లేదని అంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. తను ఇండియన్ మాత్రమే అని, అంతకు మించి తన ఐడెంటెటీ ఏదీ లేదని ఈ హీరో చెబుతూ ఉన్నాడు. ఒకవైపు దేశంలో మతం గురించి వాదోపవాదాలు, ఘర్షణలు కూడా సాగుతూ ఉన్న నేపథ్యంలో అక్షయ్ కుమార్ ఈ వ్యాఖ్యానం చేశాడు. తన తాజా సినిమా సూర్యవంశీ ప్రమోషన్లో భాగంగా అక్షయ్ మత ప్రస్తావనకు ఈ సమాధానం చెప్పాడు. తను ఇండియన్ మాత్రమే అని చెబుతున్నాడు.
ఒకవైపు అక్షయ్ కు బీజేపీ అనుకూలుడు గా ముద్ర పడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రోగ్రామ్స్ కు ప్రమోషన్ లాంటి సినిమాల్లో నటించాడు అక్షయ్. దీంతో మోడీకి అనుకూలుడు గా ఈయనకు ముద్ర పడింది. బీజేపీ సానుకూలుడు గా పేరు పడింది. ఇలా హిందుత్వ ఇమేజ్ అంటుకుంటూ ఉంది అక్షయ్ కు. ఈ నేపథ్యం లో.. తనకు మత పట్టింపు లేదని అక్షయ్ చెప్పుకొచ్చాడు. తనకు అన్ని మతాలూ సమానమే అని అంటున్నాడు. తను ఇండియన్ అంటున్నాడు.
అయితే వాస్తవానికి అక్షయ్ కుమార్ కు భారత పౌరసత్వం లేదనే వార్తలు వచ్చాయి. ఆయన కు కెనడా పౌరసత్వం ఉందని ఇది వరకూ మీడియాలో కథనాలు వచ్చాయి. సినిమా నటుడు కాకముందు అక్షయ్ కెనడా వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నాడు. అప్పట్లోనే ఇతడికి కెనడియన్ పౌరసత్వం దక్కినట్టుగా ఉంది. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు. ఇండియాలో ఎలక్షన్స్ టైమ్ లో కూడా అక్షయ్ ఎప్పుడూ ఓటేసిన దాఖలాలు లేవు. ఇలాంటి నేపథ్యంలో.. తను ఇండియన్ అని ఈ హీరో ప్రకటించుకోవడం విశేషం!