Begin typing your search above and press return to search.
ఆ అవకాశం చేజారటం వల్లే సూపర్ స్టార్ అయ్యా!!
By: Tupaki Desk | 20 Aug 2020 8:50 AM GMTబాలీవుడ్ లో అత్యధిక వార్షిక ఆదాయం ఉన్న స్టార్ గా గత రెండేళ్లుగా అక్షయ్ కుమార్ నిలుస్తున్నాడు. ఇటీవల ఒక ప్రముఖ సంస్థ వెళ్లడి చేసిన వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న టాప్ టెన్ స్టార్స్ లో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమం వంద కోట్లను రాబడుతూనే ఉన్నాయి. దాంతో అక్షయ్ కుమార్ స్టార్ డం అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్న అక్షయ్ కుమార్ ఒకానొక సమయంలో చిన్న మోడలింగ్ ఆఫర్ కోసం కన్నీరు పెట్టుకుని బతిమిలాడాడు. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు.
ఒక మోడలింగ్ ప్రాజెక్ట్ కోసం సాయంత్రం ఆరు గంటల వరకు బెంగళూరుకు వెళ్లేందుకు అక్షయ్ కుమార్ రెడీ సిద్దం అవుతున్నాడు. ఉదయం మోడలింగ్ ఏజెంట్ నుండి కాల్ వచ్చింది. ఆ వ్యక్తి నీలాంటి అన్ ప్రొఫెషనల్స్ విజయాన్ని సాధించలేరు. అందుకు నేను గ్యారెంటీ అన్నాడు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటీ అంటే నేను వెళ్లాల్సింది ఉదయం ఆరు గంటలకు కాని నేను సాయంత్రం ఆరు గంటలకు అనుకున్నాను. ఇప్పటికిప్పుడు బయలు జేరుతాను అంటూ కన్నీరు పెట్టుకుని ఆ మోడలింగ్ ఏజెంట్ ను వేడుకున్నాను. కాని అప్పటికే ఛాన్స్ పోయిదంటూ తేల్చి చెప్పారు. ఆ రోజు సాయంత్రం నేను నటరాజ్ స్టూడియోకు వెళ్లాను.
ఆ సమయంలో నన్ను చూసిన దర్శక నిర్మాత ప్రమోద్ చక్రవర్తి నాకు మూడు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాకు రూ. 50 వేలు.. రెండవ సినిమాకు లక్ష రూపాయలు మూడవ సినిమాకు లక్షన్నర పారితోషికం అంటూ చెప్పి అయిదు వేల రూపాయల చెక్కును అడ్వాన్స్ గా ఇచ్చారు. నేను బెంగళూరులో మోడలింగ్ ఈవెంట్ లో పాల్గొనాల్సిన సమయంకు అయిదు వేల రూపాయల అడ్వాన్స్ చెక్ అందుకున్నాను.
ఒక వేళ నేను బెంగళూరు వెళ్లి ఉంటే ఖచ్చితంగా ఆ ఆఫర్స్ మిస్ అయ్యేవి. అక్షయ్ తో మూడు ప్రాజెక్ట్ లు చేస్తాను అన్నట్లుగానే ప్రమోద్ చక్రవర్తి దీదర్.. ఖిలాడీ.. మిస్టర్ బాండ్ చిత్రాలను తెరకెక్కించాడు. ఆ మూడు సినిమాలు కూడా హిట్ అవ్వడం ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయడం సూపర్ స్టార్ అవ్వడం వరల్డ్ టాప్ మోస్ట్ పెయిడ్ ఆర్టిస్టు గా నిలవడం అంతా అలా అలా జరిగింది.