Begin typing your search above and press return to search.

యూనిఫామ్ అమ్మేస్తోన్న స్టార్ హీరో

By:  Tupaki Desk   |   26 April 2018 12:39 PM IST
యూనిఫామ్ అమ్మేస్తోన్న స్టార్ హీరో
X
తెరపై మంచి చేసే హోరోలను చాలా చూస్తాం. కానీ తెరపై కనిపించే విధంగా అందరూ బయట ప్రపంచంలో కూడా అలానే కనిపించరు. మంచి మానవత్వం కలిగిన రియల్ హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. మంచి సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూనే తనకు తోచిన విధంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయపడతారు. అందులో అభిమానుల పాత్ర కూడా ఉండేలా చూసుకుంటారు.

బార్డర్ లో మరణించిన సైనికుల కుటుంబాలకు తన వెబ్ సైట్ ద్వారా అక్షయ్ విరాళాలు సేకరించి అందిస్తుంటారు. అలాగే రైతులను కూడా ఆర్థికంగా ఆదుకుంటు తన వంతు సహాయాన్ని అందిస్తారు. ఇకపోతే ఇప్పుడు అక్షయ్ వన్య ప్రాణుల కోసం కొత్త దారిని ఎంచుకున్నాడు. రుస్తోమ్ సినిమాలో అక్షయ్ వేసుకున్న యూనిఫామ్ ఇప్పుడు వేలంలో ఉంది. జంతు రెస్క్యూ మరియు సంక్షేమం కోసం తనకు నచ్చిన నేవి యూనిఫామ్ ను సాల్ట్ స్కౌట్.కామ్ లో వేలానికి పెట్టాడు.

2016 లో వచ్చిన రుస్తోమ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అక్షయ్ సరసన ఇలియానా నటించింది. సినిమాలో నేవి ఆఫీసర్ గా అక్షయ్ అద్భుతంగా నటించాడు. అయితే ఆ సినిమాలో తాను వేసుకున్న ఒరిజినల్ యూనిఫామ్ ని వేలంలో ఉంచి జంతు సంరక్షణ కోసం ఆ డబ్బును ఖర్చు చేయాలని అనుకుంటున్నారు. నిజంగా అక్షయ్ రియల్ హీరో అని మరో ఉదహరణతో చెప్పకనే చెప్పేశాడు.