Begin typing your search above and press return to search.

చైనా చేరిన టాయిలెట్ వీరుడు

By:  Tupaki Desk   |   1 Jun 2018 12:29 PM GMT
చైనా చేరిన టాయిలెట్ వీరుడు
X
బాలీవుడ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. కానీ ఇంతవరకు చైనాపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనాలో కలెక్షన్ల దుమ్మురేపి చైనా మార్కెట్ రేంజి ఏమిటో బాలీవుడ్ నిర్మాతలకు తెలిసేలా చేసింది. భారీ ఫైట్లు.. హడావుడితో ఉండే సినిమాలకన్నా హ్యూమన్ ఎమోషన్ ఎక్కువగా ఉండే సినిమాలకే చైనాలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

ఇండియాలోని గ్రామాల్లో మహిళలు ఆరుబయటకు వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తీస్తూ తీసిన సినిమా టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా మన దేశంలో సూపర్ హిట్టయ్యి రూ. 135 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ప్రేమ కోసం సంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాడే ఓ సాధారణ వ్యక్తి కథ చైనా ప్రేక్షకులను సైతం ఇంప్రెస్ చేస్తోందని నిర్మాతలు ఆశపడుతున్నారు. అందుకే ఈ సినిమాను టాయిలెట్ హీరో పేరుతో డబ్బింగ్ చేసి చైనాలో విడుదల చేస్తున్నారు. ఈనెల 8న టాయిలెట్ హీరో చైనాలో విడుదల కానుంది.

టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథలో హీరోయిన్ గా భూమి పెడ్నేకర్ నటించింది. శ్రీ నారాయణ్ సింగ్ ఈ సినిమాకు డైరెక్టర్. నిర్మాతలకు బోలెడు లాభాలతోపాటు అక్షయ్ కుమార్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిందీ సినిమా. టాయిలెట్ వీరుడి ప్రేమకథ చైనా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో వేచి చూడాలి.