Begin typing your search above and press return to search.

హాటీ కోసం ఫొటోగ్రాఫ‌ర్ గా మారిన నాటీ హీరో

By:  Tupaki Desk   |   16 Sep 2021 2:30 AM GMT
హాటీ కోసం ఫొటోగ్రాఫ‌ర్ గా మారిన నాటీ హీరో
X
ప్ర‌తీ సినిమాకు ప్ర‌త్యేకంగా ఓ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ వుంటుంటాడన్న‌ది అంద‌రికి తెలిసిందే. అయితే ఓ హాట్ హీరోయిన్ కోసం స్టార్ హీరో ఏకంగా స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ గా మారితే.. కెమెరా ప‌ట్టుకుని హీరోయిన్ ని క్లిక్ క్లిక్ మ‌ర‌నిపిస్తే.. భ‌లే స‌ర‌దాగా వుంటుంది క‌దూ.. ఇలాంటి స‌ర‌దా స‌న్ని వేశం ఇటీవ‌ల `బెల్ బాట‌మ్‌` మూవీ షూటింగ్ లో జ‌రిగింది. ఖిలాడీ అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన చిత్రమిది. మహమ్మారి కారణంగా థియేటర్లు మూసివేయడంతో మూవీస్ థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం గ‌గ‌నంగా మారింది.

ఇటీవ‌ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లను తెరవడానికి అనుమతించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మొట్ట‌మొద‌టి సారిగా కోవిడ్ సెకండ్ వేవ్ త‌రువాత `బెల్ బాటమ్` థియేటర్ విడుదలైంది. ఇలా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి చిత్రం ఇదే. ఆగస్టు 19 న ఈ చిత్రం విడుదలైంది. ఇందులో అక్షయ్ కుమార్,.. వాణి కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. హ్యూమా ఖురేషి - లారా దత్తా కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఇటీవల ప్రముఖ నటి వాణి కపూర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో తన ఆకర్షణీయమైన ఫొటోని పంచుకుంది.

ఈ ఫొటోని క్లిక్ మ‌నిపించింది మరెవరో కాదు అక్షయ్ కుమార్‌. తను వాణి కపూర్ కోసం ఫోటోగ్రాఫర్ గా మారారు. వాణి కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సినిమా సెట్స్ కు సంబంధించిన ఈ ఫొటోని షేర్ చేసింది. దీనికి క్యాప్ష‌న్‌ని కూడా జ‌త చేసింది. `బెల్ బాటమ్ BTS బై వన్ అండ్ ఓన్లీ @akshaykumar`ఈ ఫొటో సినిమా షూట్ సమయంలో క్లిక్ చేసినట్లు కనిపిస్తోంది. రెడ్ లెదర్ హై హీల్ బూట్లతోబ్రౌన్‌ కలర్ ఫ్లేర్ డ్రెస్ లో నటి కారుపై వాణి కపూర్ కూర్చున్నట్లు కనిపిస్తుంది. జుట్టును ఫ్రీగా వ‌దిలేసి మ‌రింత స్టైలిష్ గా వాణి కపూర్ క‌నిపించింది.

రంజిత్ ఎం. తివారీ దర్శకత్వం వహించిన 'బెల్ బాటమ్' స్పై థ్రిల్లర్. వాషు భగ్నాని,.. జాకీ భగ్నాని,.. దీప్ శిఖా దేశ్ ముఖ్,.. మోనిషా అద్వానీ, మధు భోజాని, .. నిఖిల్ అద్వానీ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ రా ఏజెంట్ పాత్రను పోషించాడు. 1980 ల కాలంలో ప్రారంభంలో భారతదేశ విమాన హైజాక్‌ ఆధారంగా రూపొందించబడింది. లారా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. అక్షయ్ భార్యగా వాణీ నటించింది. వాణీ ఈ మూవీ తరువాత రణ్‌బీర్ కపూర్‌తో 'శంషేరా,.. ఆయుష్మాన్ ఖురానాతో 'చండీగఢ్ కరే ఆశికి' లో కనిపించనుంది.

డేర్ చేసినా నిరాశే ఎదురైంది!

స‌రిగ్గా క‌రోనా సెకెండ్ త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రుణంలో హీరోలు నేరుగా థియేట‌ర్లోకి రావ‌డానికి సంకోచిస్తోన్న స‌మ‌యంలో అక్ష‌య్ బెల్ బాట‌మ్ డేర్ గా థియేట‌ర్లో రిలీజ్ అయింది. కానీ సినిమా కు టాక్ బావున్నా తొలి షోతోనే బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. మిశ్ర‌మ స్పంద‌న‌ల‌తో వ‌సూళ్లు అంత‌కంత‌కు ప‌డిపోయాయి. అస‌లే క‌రోనా దెబ్బ‌కు జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. దీంతో అక్ష‌య్ కెరీర్ లోనే లీస్ట్ వ‌సూళ్లు తెచ్చిన తొలి చిత్రంగా నిలిచిపోయింది. ఆ ర‌కంగా థియేట‌ర్లో రిలీజ్ అయి `బెల్ బాట‌మ్` దెబ్బయిపోయింది.

ఇప్పుడీ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబ‌ర్ 16 నుంచి స్ట్రీమింగ్ అవ్వ‌డానికి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఓటీటీ ప్రేక్ష‌కులు చూడ‌టానికి ఎంత మాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని టాక్ వినిపిస్తోంది. ఆడియ‌న్స్ సినిమాపై ఎంత మాత్రం ఎగ్జైట్ మెంట్ చూపించ‌డం లేదు. థియేట‌ర్ రిలీజ్ తో నెగిటివ్ టాక్ రావ‌డంతో ఓటీటీలో ఇలా రిలీజ్ కి ముందే చ‌తికిల ప‌డిపోయింది. ముందుగా థియేట‌ర్లో రిలీజ్ అయి..అక్క‌డ తేడా కొట్టి ఓటీటీలోకి వ‌స్తే ఏ సినిమాకైనా ఇదే ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. ఈ నేప‌థ్యంలో `బెల్ బాట‌మ్` ని ఓ గుణ‌పాఠంగా చెప్పొచ్చు. ఇదే సినిమా ముందుగా ఓటీటీలో రిలీజ్ అయి ఉంటే క‌నీసం సినిమా కొంత ప్రాఫిట్ తోనైనా సేఫ్ జోన్ లో ఉండేది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకుంటే సుఖ‌మేమి అన్న చందంగా త‌యారైందట‌.