Begin typing your search above and press return to search.
పిండేశావయ్యా అక్షయ్ కుమార్
By: Tupaki Desk | 6 March 2016 5:30 PM GMTబాలీవుడ్ లో ఏ ఇగోలు లేకుండా అందరితోనూ కలివిడిగా ఉండే హీరోల్లో అక్షయ్ కుమార్. చాలా కింది స్థాయి నుంచి వచ్చిన అక్షయ్ తన గతాన్ని మరిచిపోలేదు. షూటింగ్ సందర్భంగా లైట్ బాయ్ దగ్గర్నుంచి అందరినీ ఎంతో గౌరవిస్తాడని అతడికి మంచి పేరుంది. ఈ హీరోకు మానవతా దృక్పథం కూడా చాలా ఎక్కువే. సామాజిక కార్యక్రమాల కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఆ మధ్య నానా పటేకర్ ను స్ఫూర్తిగా తీసుకుని రైతుల కోసం చాలా సాయం చేశాడు.
ఒకప్పుడు యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కుమార్.. ఈ మధ్య ఎక్కువగా కామెడీ - ఎమోషనల్ సినిమాలే చేస్తున్నాడు. ఐతే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చింది యాక్షన్ సినిమాలే కావడంతో ఆ సినిమాల్లో తన కోసం ఎంతగానో కష్టపడిన స్టంట్ మెన్లను అతను మరిచిపోలేదు. తన జీవితంలో ఈ స్టంట్ మెన్ల పాత్ర ఎంత కీలకమో చెబుతూ.. వారికి అక్షయ్ రాసిన బహిరంగ లేఖ అందరినీ కదిలిస్తోంది.
‘‘నా పిల్లలకు ఈ రోజు తండ్రి ఉన్నాడంటే అందుకు నాన స్టంట్ మెన్లే కారణం. నేను కూడా స్టంట్ మెన్ గా పని చేసి.. ఆ తర్వాత హీరో అయిన వాడినే. వాళ్లు సినిమా కోసం ఎంత కష్టపడతారో మీకు చెప్పాలి. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. హీరోల కోసం ఎన్నోసార్లు త్యాగాలు చేయడానికి.. ఎంత పైనుంచి అయినా దూకడానికి రెడీగా ఉంటారు. వాళ్ల త్యాగానికి వెలకట్టలేం’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు అక్షయ్. తన తర్వాతి సినిమాకు పని చేయాల్సిన ఇంటర్నేషనల్ స్టంట్ మేన్ స్కాట్ కాస్ గ్రోవ్ ఓ ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో అక్షయ్ ఈ బహిరంగ లేఖ రాశాడు. చాలా ఎమోషనల్ గా అక్షయ్ రాసిన లేఖ అతడి పెద్ద మనసును చాటుతోంది.