Begin typing your search above and press return to search.

చిన్ని కృష్ణకు భారీ కౌంటర్ ఇచ్చిన ఆకుల శివ!

By:  Tupaki Desk   |   27 March 2019 11:26 AM GMT
చిన్ని కృష్ణకు భారీ  కౌంటర్ ఇచ్చిన ఆకుల శివ!
X
ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ప్రజల మధ్య విద్వేషాలు రగిలేలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడంటూ ఈమధ్య రచయిత చిన్ని కృష్ణ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కాపులకు మెగా ఫ్యామిలీ సభ్యులు ప్రతినిథులేమీ కాదని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై మరో పాపులర్ రచయిత ఆకుల శివ సీరియస్ గా స్పందించారు.

ఇన్నేళ్ళ తన కెరీర్ లో ఎప్పుడూ కెమెరా ముందుకు రావడానికి తాను ఆసక్తి చూపించలేదని.. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందని అన్నారు ఆకుల శివ. చిన్ని కృష్ణ ఇంటి పేరు.. తన ఇంటిపేరు ఒకటేనని.. చిన్ని కృష్ణ గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అన్నాడు. "ఇంద్ర లాంటి పెద్ద హిట్ సినిమా ఇస్తే తనను ఇంటికి పిలిచి విస్తరాకు వేసి కనీసం భోజనం కూడా పెట్టలేదని చిన్ని కృష్ణ అన్నాడు. 'నాయక్' సినిమాకు మేము చేసిన వర్క్ చిరంజీవి గారికి నచ్చడంతో వినాయక్ గారిని నన్ను ఇంటికి పిలిచారు. భోజనం పెట్టడమే కాదు.. రూ. 5 లక్షల డబ్బు ఇచ్చి 150 వ సినిమాకు మాటలు రాయమని కోరారు.. అది ఆయన సంస్కారం. అయన భోజనం పెట్టలేదు.. బాల పాయింట్ పెన్ ఇవ్వలేదు అంటున్నావే. అసలు నీగురించి తెలిసిన వారెవరైనా అసలు నిన్ను ఇంటికి పిలుస్తారా? నేనే పిలవను.. అలాంటిది మెగాస్టార్ ఎందుకు పిలుస్తారు" అన్నాడు.

అంతే కాదు కొన్నేళ్ళ క్రితం చిన్ని కృష్ణ సోదరుడు తెనాలిలో ఒక కేసులో ఇరుక్కుంటే చిన్ని కృష్ణ వచ్చి విడిపించమని తన కాళ్ళు పట్టుకున్నాడని.. అప్పుడు హైదరాబాద్ నుండి అక్కడికి వెళ్లి తనకున్న పరిచయాలతో ఆయనను విడిపించానని అన్నాడు. ఆ సమయంలో ఎస్సై చిన్ని కృష్ణ ను చూసి ఒక మాట అన్నాడని.. "అది గుర్తుందా.. చెప్పమంటావా చిన్ని కృష్ణా.. అలాంటిది నీకు పవన్ కళ్యాణ్ గురించి.. చిరంజీవి గారి గురించి వ్యక్తిగతంగా విమర్శించే అర్హత ఉందా.. నీతి ఉందా.. నిజాయితీ ఉందా? ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ పుస్తకం మొత్తం తెరుస్తాను. పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేయమని ఎన్ని వందల సార్లు అడిగావు నువ్వు? నీలాంటి చీటర్స్ ను ఆయన కలవడయ్యా.. నీ గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్పలేను అన్నాను కదా? కులం చూసి ఎవరూ దగ్గరకు తీసుకోరు.. గుణం చూసిమాత్రమే విలువ ఇస్తారు. సురేష్ బాబు గారు నాకు ఎన్నో సార్లు సహాయం చేశారు.. అయన ఎప్పుడూ కులం చూడలేదు."

"ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లో ఎవరిని నువ్వు పెళ్లి చేసుకున్నావు? ఆ ఫోటోలు ఏ పేపర్లో వచ్చాయి.. తీసి చూపించామంటావా? నీ గతం మొత్తం తెలిసిన వాడిని. నీవల్ల నష్టపోయిన వాడిని. ఈరోజు నేను సమాజానికి చెప్తున్నా 'ఇంద్ర' సినిమాలో గవర్నర్ ఇంట్రడక్షన్ నుంచి కామెడి ట్రాక్ నుంచి.. లవ్ సీన్స్ నుండి.. నీది తెనాలి నాది తెనాలి నుంచి రాసింది ఎవరు? చిరంజీవి గారు నన్ను ' శివ..రైటర్ గా నీ పేరు వేసుకో' అంటే ఆరోజు నైట్ ఎడ్చావు. అందుకే సరే అన్నా. నరసింహనాయుడు సినిమా రాశావు. దానిపైన ఎన్ని గొడవలు అయ్యాయి? 'ఆనంద పుంగాట్రె' అని తమిళ సినిమాను నువ్వు యాజిటీజ్ కొట్టేస్తే.. ఆవిషయం తెలిసి సీ. కళ్యాణ్ గారు నిన్ను కొట్టాడానికి వస్తే కాపాడింది ఎవరో గుర్తుందా? వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టే నేను ఇప్పుడు శాంపిల్ ఇచ్ఛా. ఇంకా మాట్లాడితే మొత్తం పేజీలు ఓపెన్ చేస్తా."