Begin typing your search above and press return to search.
అక్కినేని కథ అలా మెగా హీరోకి చేరింది
By: Tupaki Desk | 27 Dec 2017 5:23 AM GMTసాధారణంగా దర్శకుడు ఒక కథ అనుకున్నప్పుడు మొదట అనుకున్న హీరోతోనే చేయలేకపోవచ్చు ఒక కథ ఒక్కోసారి ఎంతో మంది హీరోలని కలిసి వస్తుంది. ఫైనల్ ఒక హిరోతే సెట్ అయితే అప్పుడే అసలు రూపం దాల్చుకుంటుంది. ఒక చిన్న హీరో కుదరదు అన్న కథని స్టార్ హీరో చేయవచ్చు అలాగే ఒక పెద్ద హీరో కాదు అన్న కథని చిన్న హీరో చేసి మంచి హిట్ అందుకోవచ్చు. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి తరహా చర్యలు జరుగుతూనే ఉంటాయి.
అయితే అదే తరహాలో ఇప్పుడు ఒక కథ అక్కినేని కాంపౌండ్ నుండి మెగా కాంపౌండ్ కి జంప్ చేసిందట. గతంలో నాగార్జునతో డమరుకం సినిమా చేసిన కామెడీ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఆ సినిమా తరువాత నాగ చైతన్య తో ఒక సినిమా చేయాలనీ అనుకున్నాడు. అందుకు నాగార్జున కూడా సపోర్ట్ చేశాడు. లక్ష్మి - కృష్ణ - నాయక్ వంటి సినిమాల రచయిత శివ ఆకుల అందుకు కథను కూడా రెడీ చేశారు. అయితే నిర్మాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల సినిమా తెరకెక్కలేదు. అయితే అదే కథను శివ ఆకుల తన సన్నిహిత దర్శకుడైన వివి.వినాయక్ కి ఇచ్చాడు. ప్రస్తుతం వినాయక్ సాయి ధరమ్ తేజ్ లో తెరకెక్కుతోన్న సినిమా అదే. ఆ విధంగా అక్కినేని హీరో కథ మెగా హీరోకి అందింది.
ఆ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడట. సాయి ధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోన్న సంగతి తెలిసిందే.