Begin typing your search above and press return to search.
రజినీ వల్ల కాలేదు.. ధనుష్ వల్ల అవుతుందా?
By: Tupaki Desk | 24 Oct 2016 9:30 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. విదేశాల్లో సైతం ఆయన విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ‘రోబో’ సీక్వెల్ ‘2.0’తో రజినీ పాపులారిటీని మరింత విస్తృతం చేద్దామని చూశాడు డైరెక్టర్ శంకర్. ఈ సినిమాలో విలన్ పాత్రకు హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ ను తీసుకోవాలని చూశాడు. అదే జరిగి ఉంటే ఈ సినిమా రేంజే మారిపోయేది. రజినీకి విలన్ గా ఆర్నాల్డ్ అంటే ఆ కాంబినేషనే వేరుగా ఉండేది. కానీ అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఐతే ఇప్పుడు రజినీ అల్లుడు ధనుష్ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు.. ఆల్ పాసినో.
‘గాడ్ ఫాదర్’ సిరీస్ సహా ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న ఆల్ పాసినోను ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ చేయబోయే కొత్త సినిమా కోసం సంప్రదిస్తున్నారట. కార్తీక్ తొలి మూడు సినిమాలకూ అద్భుతమైన స్పందన వచ్చింది. తమిళ సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడని అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు విమర్శకులు. ధనుష్ తో చేయబోయే సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ అదిరిపోయే స్క్రిప్టు రెడీ చేశాడట కార్తీక్. అందులో కీలక పాత్రకు ఆల్ పాసినోను ఒప్పించాలని చూస్తున్నాడు. కార్తీక్ పాసినోను ఒప్పించగలిగితే ఈ సినిమా రేంజే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/