Begin typing your search above and press return to search.

అల క్రెడిట్‌ మొత్తం ఆయనకే ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   20 Jan 2020 6:12 AM GMT
అల క్రెడిట్‌ మొత్తం ఆయనకే ఇచ్చేశారు
X
సంక్రాంతి విన్నర్‌ అల వైకుంఠపురంలో అనడంలో ఏమాత్రం సందేహం లేదు అంటూ సోషల్‌ మీడియా జనాలు ఘంటా పథంగా చెబుతున్నారు. అద్బుతమైన కలెక్షన్స్‌ రాబడుతూ బన్నీ కెరీర్‌ లో టాప్‌ చిత్రంగా నిలవడంతో పాటు తెలుగు సినిమా టాప్‌ చిత్రాల జాబితాలో ఈ చిత్రం నిలువబోతుంది. మాటల మాంత్రికుడు మ్యాజిక్‌ చేయడంతో పాటు థమన్‌ ఈ సినిమాకు అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్లింది. సినిమా విడుదలకు ముందు నుండే ఈ చిత్రంపై అంచనాలు పెంచేలా థమన్‌ సంగీతం పని చేసింది.

సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో వైజాగ్‌ లో నిన్న భారీ ఎత్తున సక్సెస్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ సక్సెస్‌ క్రెడిట్‌ పూర్తిగా థమన్‌ కు ఇచ్చేశారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ థమన్‌ ను ఆకాశంలో ఉంచాడు. ఆ సమయంలో థమన్‌ కళ్లలో నీళ్లు ఆగలేదు. తల దించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. థమన్‌ ఆనందంకు హద్దు లేదని చెప్పాలి. హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ ఈ సినిమాకు థమన్‌ సైలెంట్‌ హీరో. ఇది నా కెరీర్‌ బెస్ట్‌ ఆల్బమ్‌ అంది.

బన్నీ మాట్లాడుతూ సినిమా ప్రారంభం సమయంలో ఎలాంటి మ్యూజిక్‌ కావాలని థమన్‌ అడిగినప్పుడు బిలియన్‌ వ్యూస్‌ వచ్చే ఆల్బమ్‌ కావాలని అడిగాను. అడిగినట్లుగానే థమన్‌ ఆ స్థాయి సంగీతాన్ని అందించాడు. ఆల్బమ్‌ ఆఫ్‌ ది డికేడ్‌ గా ఈ చిత్రంలోని పాటలు నిలుస్తాయని బన్నీ అన్నాడు. ఇంతటి మంచి ఆల్బమ్‌ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నాడు.

త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాను థమన్‌ తన బుజాల మీద వేసుకుని మీ ముందుకు తీసుకు వచ్చాడు. థమన్‌ ఇచ్చిన సంగీతం కు ఏ ఒక్కరు కూడా కాలు కదపకుండా ఉండలేరు. ప్రేక్షకులను తన పాటలతో టికెట్‌ కొనేలా చేశాడు. టికెట్‌ కొంటారా లేదా అంటూ ప్రేక్షకులను థియేటర్‌ వద్దకు తీసుకు రావడంలో థమన్‌ సక్సెస్‌ అయ్యాడు. థమన్‌ కారణంగానే సినిమాకు ఇంత ఆధరణ ఇంతటి కలెక్షన్స్‌ అంటూ త్రివిక్రమ్‌ పూర్తి క్రెడిట్‌ ను థమన్‌ కు ఇవ్వడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

కేవలం త్రివిక్రమ్‌ మాత్రమే కాకుండా అల్లు అర్జున్‌.. పూజా హెగ్డే.. ఇంకా నిర్మాతలు మరియు టెక్నీషియన్స్‌ ఇలా అంతా కూడా థమన్‌ కు సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ ను కట్టబెడుతూ మాట్లాడారు. థమన్‌ కెరీర్‌ బెస్ట్‌ ఆల్బంగా ఇది నిలిచి పోవడం ఖాయం అంటున్నారు.