Begin typing your search above and press return to search.

అల వైకుంఠపురంలో సందడి తగ్గలేదట

By:  Tupaki Desk   |   7 March 2020 12:30 AM GMT
అల వైకుంఠపురంలో సందడి తగ్గలేదట
X
అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌ లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే. కలెక్షన్స్‌ పరంగా బన్నీ సరికొత్త రికార్డులను దక్కించుకున్నాడు. నాన్‌ బాహుబలి రికార్డులను కూడా దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్‌ స్వరపర్చిన ఈ పాటలు గత మూడు నాలుగు నెలలుగా కుమ్మేస్తూనే ఉన్నాయి.

సినిమా విడుదలకు ముందే వచ్చేసిన పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. యూట్యూబ్‌ లో రికార్డు స్థాయి వ్యూస్‌ ను సొంతం చేసుకున్న ఈ ఆల్బమ్‌ ఇంకా సందడి చేస్తూనే ఉందట. తాజాగా అల వైకుంఠపురంలో సినిమా ఆడియో రైట్స్‌ ను కొనుగోలు చేసిన ఆధిత్య మ్యూజిక్‌ వారు ఒక ప్రకటన లో అన్ని మ్యూజిక్‌ ఫ్లాట్‌ ఫామ్‌ లపై అల వైకుంఠపురంలో సినిమా పాటలు టాప్‌ లో ట్రెండ్‌ అవుతున్నాయన్నారు. సినిమాలోని అన్ని పాటలను కూడా ప్రేక్షకులు ఇంకా రోజుకు లక్షల సార్లు వింటున్నారంటూ ఆధిత్య మ్యూజిక్‌ ప్రకటన లో తెలియజేసింది.

అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్‌ నుండి బన్నీ అండ్‌ టీం.. పాటలు సక్సెస్‌ అంటూ ఆధిత్య మ్యూజిక్‌ వారు యమ సంబర పడుతున్నారు. ఇంకా సందడి కంటిన్యూ అవుతుంది అంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే వారు తెలుసుకోవాల్సింది ఏంటీ అంటే ఇలాంటి అద్బుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి. వాటినే పట్టుకుని ఉండకుండా ఆ మూడ్‌ నుండి బయటకు రావాలంటూ నెటిజన్స్‌ సూచిస్తున్నారు.