Begin typing your search above and press return to search.

రేసు పూర్తి కాక ముందే ఫలితం చెప్పేసుకుంటే ఎలా?

By:  Tupaki Desk   |   14 Jan 2020 4:54 AM GMT
రేసు పూర్తి కాక ముందే ఫలితం చెప్పేసుకుంటే ఎలా?
X
పెద్ద ప్లేయర్.. చిన్న ప్లేయర్.. తేడాలు ఉండొచ్చు. పెద్ద ప్లేయర్ మీద ఉన్న అంచనాలు చిన్న ప్లేయర్ మీద ఉండకపోవచ్చు. అంత మాత్రాన.. మ్యాచ్ కాకుండానే టైటిల్ విజేతను డిక్లేర్ చేయటం ఎలా ఉంటుంది? గెలుపు మీద ధీమా వేరు.. పోటీ పూర్తి కాకముందే టైటిల్ మాదేనని కప్పు పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంచుమించు ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తోంది అల వైకుంఠపురములో టీం.

సంక్రాంతి సినిమా రేసు రజనీకాంత్ దర్బార్ తో మొదలై కల్యాణ్ రామ్ ఎంత మంచివాడవు రాతో పూర్తి అవుతుంది. అలాంటప్పుడు ఆ సినిమా విడుదలయ్యే వరకూ సంక్రాంతి విజేత ఎవరో తేల్చటం సరికాదు. రేసు పూర్తి కాకముందే రిజల్ట్ చెప్పేయటంలో అర్థం లేదు. సినిమా చిన్నదే కావొచ్చు. అంత మాత్రాన తేలికగా తీసేసినట్లుగా మాటలు ఉండకూడదన్నది మర్చిపోకూడదు.

సంక్రాంతి రేసులో ఎంత మంచివాడవురా చిత్రం విడుదల కాకముందే.. తామే సంక్రాంతి విన్నర్లమంటూ అల వైకుంఠం టీం పబ్లిసిటీ ఇచ్చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా భేటీలో.. సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ.. తనను తాను సంక్రాంతి విజేతగా ప్రకటించేసుకోవటం గమనార్హం. బాధ్యత తనను మరింత బాగా పని చేయించిందని.. సంక్రాంతి రేసులో పరిగెత్తామని.. కొంచెం బరువు ఉన్నా తానే గెలిచేలా చేశారని వ్యాఖ్యానించారు. తుది ఫలితం మీద ఎంత క్లారిటీ ఉన్నప్పటికి.. పోటీ పూర్తి కాక ముందే విజేతగా ప్రకటించేసుకోవటం సరికాదు.