Begin typing your search above and press return to search.
రెండ్రోజుల్లో అల వసూళ్లు ఇవే
By: Tupaki Desk | 14 Jan 2020 2:37 PM GMTసంక్రాంతి పందెంలో మహేష్ .. బన్ని నువ్వా నేనా? అంటూ పోటీపడి ఓపెనింగులు సాధించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇతరులతో పోలిస్తే బన్ని జరంత స్పీడ్ ఎక్కువే మెయింటెయిన్ చేస్తున్నాడని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఎట్టకేలకు బన్నీ ఏడాదిన్నర వెయిటింగ్ ఫలించింది. `నా పేరు సూర్య` చిత్రం తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నా బ్లాక్ బస్టర్ ఓపెనింగులతో దాన్ని మైమరపించే గిఫ్ట్ అందుకున్నాడు. అందుకే త్రివిక్రమ్ కి మరీ అంత స్ట్రాంగ్ హగ్ ఇచ్చాడని ఇదిగో ఈ వసూళ్లు చూస్తే అర్థం చేసుకోవచ్చు.
అల వైకుంఠపురములో రెండు రోజుల కలెక్షన్స్ పరశీలిస్తే.. నైజాం 9.20కోట్లు.. సీడెడ్ 4.7కోట్లు.. నెల్లూరు 1.62కోట్లు.. కృష్ణ 5.20కోట్లు.. గుంటూరు 4.21కోట్లు.. ఉత్తరాంధ్ర 8.50కోట్లు.. ఈస్ట్ 3.05కోట్లు.. వెస్ట్ గోదావరి 5.20కోట్లు.. ఆంధ్ర+తెలంగాణ 33.22కోట్లు వసూలవ్వగా రెస్టాఫ్ ఇండియా 5.10 కోట్లు ఓవర్సీస్ 8.20కోట్లు.. కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 46.52 కోట్లు వసూలైంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఆ మేరకు షేర్ వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటికి సగం వసూళ్లు దక్కాయి. మరో 50శాతం షేర్ రాబట్టాల్సి ఉందని అంచనా వేస్తున్నారు.