Begin typing your search above and press return to search.
హిందీ ప్రేక్షకులకు ఇప్పుడు మనవే దిక్కు
By: Tupaki Desk | 18 Jan 2022 2:58 AM GMTగత నెల నుండి ఉత్తర భారతంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా చిన్న బాలీవుడ్ సినిమాలు కూడా విడుదల కావడం లేదు. పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ వాతావరణం ఉండటం వల్ల థియేటర్లు మూత పడుతున్నాయి. తెరచి ఉన్న థియేటర్లకు పాత సినిమాలు దిక్కు అవుతున్నాయి. ఈ సమయంలో పుష్ప సినిమా హిందీలో మంచి వసూళ్లను దక్కించుకుంటుంది. గత నెలలో విడుదల అయిన పుష్ప ఇంకా కూడా అక్కడ మంచి షేర్ ను రాబడుతుంది అనేది బాలీవుడ్ వర్గాల టాక్. పుష్ప సినిమా ఇప్పటికే అన్ని భాషల్లో ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అయినా కూడా థియేటర్ల వద్ద జనాలు ఉంటున్నారు. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మన సినిమాలే మరిన్ని వెళ్లబోతున్నాయి.
రెండేళ్ల క్రితం వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయినా కూడా ఇప్పుడు ఆ సినిమాను థియేటర్ రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు. అల వైకుంఠపురంలో హిందీ వర్షన్ స్క్రీనింగ్ కు డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. రిపబ్లిక్ డే సందర్బంగా సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా హిందీ డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న నిర్మాత ప్రకటించాడు. కేవలం అల వైకుంఠపురంలో సినిమాతో ఆగిపోకుండా మరిన్ని సౌత్ సినిమాలను కూడా ప్రేక్షకుల హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్తారని తెలుస్తుంది. పుష్ప సినిమాకు ప్రస్తుతం అక్కడ మంచి బజ్ ఉంది. అందుకే పుష్ప డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా ను సుకుమార్ పేరు చెప్పి విడుదల చేయబోతున్నారట.
రంగస్థలం సినిమా ను ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఖచ్చితంగా రంగస్థలం హిందీ వర్షన్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను డబ్బింగ్ హక్కులు దక్కించుకున్న మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన అల వైకుంఠపురంలో మరియు రంగస్థలం సినిమాలు హిందీలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయి అనేది చర్చనీయాంశంగా మారింది.
హిందీ సినిమాలు ఏమీ లేవు.. పైగా ఈ సినిమాలు మంచి విజయాన్ని ఇప్పటికే సొంతం చేసుకున్నాయి కనుక ఖచ్చితంగా హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలవు. వారికి ఈ సినిమాలు తప్ప మరే దిక్కు లేదు. కనుక తప్పని పరిస్థితుల్లో వారు మన సినిమాలు చూడాల్సిందే. కనుక పుష్ప రేంజ్ లో కాకున్నా ఖచ్చితంగా అల వైకుంఠపురంలో మరియు రంగస్థలం హిందీ వర్షన్ లకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా మరికొన్ని సౌత్ సినిమాలు కూడా డబ్బింగ్ అయ్యి హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.