Begin typing your search above and press return to search.
అల్లు అరవింద్ డబ్బా కొట్టడం ఎక్కువైందే!
By: Tupaki Desk | 30 Jan 2020 8:57 AM GMTఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' ఘన విజయం సాధించింది. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఈ సంక్రాంతి విజేత కూడా అల్లు అర్జున్ సినిమానే. అందులో కూడా ఎలాంటి అనుమానమూ లేదు. అయితే కలెక్షన్స్ మాత్రం 'అల వైకుంఠపురములో' టీమ్ ప్రచారం చేసుకున్నంత రేంజ్ లో లేవనేది అటు ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నా మాట.. ఇటు ప్రేక్షకులు కూడా బలంగా నమ్ముతున్న మాట.
అయితే 'అల వైకుంఠపురములో' టీమ్ ఏ మాత్రం తగ్గకుండా బాహుబలికి మించి అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ అయితే తమ సినిమా గురించి రెండాకులు ఎక్కువే చెప్తున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో దాదాపు గా డబ్బా కొట్టుకున్నంత పని చేశారు. ఒక విలేఖరి "ఈ సినిమా బాహుబలి రికార్డులను కొన్ని సెంటర్లలో క్రాస్ చేసింది. అయితే పోస్టర్ లో నాన్ బాహుబలి రికార్డులు అని వేసుకున్నారు. నాన్ బాహుబలి 2 రికార్డులు అని వేసుకోవాలి కదా?" అంటూ అరవింద్ గారిని ఉత్సాహ పరుస్తూ రెచ్చగొట్టే ప్రశ్న వేశాడు. దీనికి అరవింద్ గారు సాధారణ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే విధంగా జవాబిచ్చారు.
"మీరన్నది కరెక్టు.. మీరన్నది కరెక్ట్. ఈ సినిమా చాలా ఏరియా లలో బాహుబలి కలెక్షన్లను దాటి బాహుబలి 2 కలెక్షన్స్ తర్వాత ఆగింది. అయితే బాహుబలి అనేది ఒక యూనిట్ గా తీసుకుని నాన్ బాహుబలి అని చెప్పి ఉంటారు. ఇందాక ఎవరో యూఎస్ కలెక్షన్ల గురించి అడిగారు. హీరోలకు.. డైరెక్టర్లకు ఈ కలెక్షన్స్ వివరాలు డీప్ గా తెలియకపోవచ్చు. ఈ వివరాలు డబ్బు లేక్కపెట్టుకునే నిర్మాతలకే ఎక్కువ తెలుస్తాయి. యూఎస్ లో ఈ సినిమా టాప్-10 లో కాదు. టాప్ 3 లో ఉంది. త్వరలో నెక్స్ట్ బాహుబలి స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ బాగా కలెక్ట్ చేస్తోంది. నెక్స్ట్ బాహుబలి 2 వెళ్లే అవకాశం కూడా ఉంది" అన్నారు. ఇంతలో పక్కనే కూర్చుని ఉన్న రాధాకృష్ణ తనయుడు వంశీ కరెక్ట్ చేయడంతో అల్లు అరవింద్ తన సెట్మేంట్ ను సరి చేసుకున్నారు. "సారీ.. మా సినిమా త్వరలో టాప్ 3 కి చేరుతుంది" అంటూ ముగించారు.
యూఎస్ లో బాహుబలి.. బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చెయ్యడం దాదాపుగా అసాధ్యం.. మరో భారీస్థాయి సినిమా వస్తే తప్ప సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ల తో వాటి కలెక్షన్ల దరిదాపులకు కూడా పోలేరు. కానీ అరవింద్ గారు మాత్రం ఫ్లోలో నాన్ - బాహుబలి 2 ని రాసుకోవాలి.. బాహుబలి ని క్రాస్ చేశాం అంటున్నారు. కానీ నెటిజన్లు మాత్రం 'రంగస్థలం' కలెక్షన్స్ కూడా దాటలేదు. ఇదంతా ఫేక్ వ్యవహారం అని చిర్రు బుర్రులాడుతున్నారు. అయినా సీనియర్ నిర్మాత అయిన అరవింద్ గారికి ఈ డబ్బా కొట్టుకునే అవసరం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.