Begin typing your search above and press return to search.
నా వల్లనే అలీ హీరో అయ్యాడు: బ్రహ్మానందం
By: Tupaki Desk | 30 Nov 2021 6:40 AM GMTతెలుగు తెరపై .. తెలుగు కథలో హాస్యానికి ఉన్న స్థానం ప్రత్యేకం. నవరసాల్లో హాస్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకు కారణం హాస్య రసాన్ని పోషించడం ఎంతో కష్టం కనుక. నవ్వించడమనేది నవ్వడమంత తేలిక కాదు. ఎదుటివారిని ఏడిపించడం ఎంత తేలికనో .. నవ్వించడం అంత కష్టమైన విషయం. అలాంటి హాస్యరసాన్ని అదే పనిగా మధిస్తూ, ఆశేష ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు బ్రహ్మానందం. హాస్యనటుడిగా సుదీర్ఘమైన ప్రయాణం .. వందలాది సినిమాలు .. పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి.
అలాంటి బ్రహ్మానందం తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. "సత్తెనపల్లి మండలం .. ముప్పాళ్ల సమీపంలోని 'చాగంటోరి పాలెం' అనే గ్రామంలో నేను పుట్టిపెరిగాను. నా గ్రాడ్యుయేషన్ అంతా 'భీమవరం'లోను .. ఎం.ఎ. ఆంధ్ర యూనివర్సిటీలోను పూర్తి చేశాను. 'అత్తిలి'లో కొంతకాలం పాటు లెక్చరర్ గా పనిచేశాను. ఆ తరువాతనే నేను సినిమాల్లోకి వచ్చాను. 1985లో నరేశ్ హీరోగా చేసిన 'తాతావతారం' అనే సినిమా ద్వారా దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణ నన్ను పరిచయం చేశారు.
'యమలీల' సినిమాకి ముందు తాము ఒక ఎక్కడ ఎప్పుడు కలుసుకున్నది గుర్తు చేసుకోమని బ్రహ్మానందం అంటే, 'మాయలోడు' సినిమా ఆడియో ఫంక్షన్ .. లక్డికాపూల్ లోని అశోక హోటల్లో జరిగింది. ఆ స్టేజ్ పై నేను డాన్స్ చేశాను. అక్కడ మనం కలుసుకున్నాము. ఆ డాన్స్ చూసి అచ్చిరెడ్డిగారికీ .. కృష్ణారెడ్డి గారికి .. రైటర్ దివాకర్ బాబుగారికి ఒక ఐడియా వచ్చిందట. అలీని హీరోగా చేస్తే ఎలా ఉంటుంది? అని వాళ్లంతా అనుకున్నారట. ఆ సినిమాలో చిత్రగుప్తుడిగా నువ్వు చేయడం .. అది ఎంతో పేరు తీసుకురావడం జరిగింది" అని అలీ అన్నాడు.
అప్పుడు బ్రహ్మానందం అందుకుంటూ, "ఆ రోజున కృష్ణారెడ్డిగారు .. అచ్చిరెడ్డి గారు .. దివాకర్ బాబు గారి దగ్గరికి నేను వెళ్లాను. అలీ బ్రహాండమైన డాన్సర్ అండీ .. వాడి దగ్గర హీరో మెటీరియల్ ఉంది. కాబట్టి హీరోగా వాడికి ఛాన్స్ ఇస్తే మీ పేరు నిలబెడతాడు .. వాడికీ పేరు వస్తుందని నేను చెప్పాను. అప్పుడు వాళ్లు ఆలోచించుకోవడం జరిగింది. మొన్న కూడా అచ్చిరెడ్డి గారు నా దగ్గర ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. "మీరు ఆ రోజున చెప్పారు .. నిజంగానే హీరోగా అలీ మా పేరు నిలబెట్టాడు. ఆయన మా ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. అంటూ బ్రహ్మానందం గుర్తు చేశారు.