Begin typing your search above and press return to search.

సుమ నా చెల్లి, సమాంత గుడ్ ఫ్రెండ్

By:  Tupaki Desk   |   31 July 2015 6:19 PM GMT
సుమ నా చెల్లి, సమాంత గుడ్ ఫ్రెండ్
X
అలీ ఇటీవలి కాలంలో వెండితెరతో పాటు బుల్లితెరపైనా సందడి చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆడియో వేడుకలు, సక్సెస్‌ మీట్‌ లలోనూ యాంకరింగ్‌ పేరు తో హల్‌ చల్‌ చేస్తుంటాడు. కో యాంకర్ల తో కలిసి అతడు వేసే జోకులు మాంచి మాస్‌ మసాలాతో అదిరిపోతుంటాయి. వాటికి గ్యాలరీల్లో జనాలు ఇరగబడి నవ్వేస్తారు. స్పాంటేనియస్‌ గా అతడు వేసే పంచ్‌ లు జనాల్లో నవ్వులు పూయిస్తుంటాయి.

అపుడప్పుడు అతడు మాట్లాడే కిళికి తరహా లాంగ్వేజీ గిలిగింతలు పెడుతుంటుంది. హీరోయిన్ల విషయంలో అలీ ఫిలాంతర్‌ ఫకిడీ లాంగ్వేజ్‌ మాస్‌ లోకి బాస్‌ లా దూసుకుపోతుంటుంది. కథానాయికలు, అమ్మాయిలు నడుము ఒంపుల్ని, నడకలో వయ్యారాల్ని వర్ణించి కొన్నిసార్లు లేడీస్‌ లో అబాసుపాలయ్యాడు. ఈ మధ్య కాలంలో కొన్ని బూతు జోకులు మహిళామణులకు ఇర్రిటేషన్‌ తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. మనోడు చేసిన సమంత వెయిస్ట్‌ 'బెంజి సర్కిల్‌' కామెంట్‌ పెద్ద రచ్చనే చేసింది.

అప్పట్లో సన్నాఫ్‌ సత్యమూర్తి ఆడియో వేడుక బ్యాక్‌ స్టేజీ దగ్గర యాంకర్‌ సుమ అలీపై అలిగి వెళ్ళిపోయింది అనుకున్నారు. ఇప్పుడు దానిపై అలీ క్లారిటీ ఇచ్చాడు. సుమ నాకు చెల్లెలు లాంటిది. తనతో అలాంటిది ఉండదు. ఆరోజు తన కొడుకు పుట్టినరోజు ఉందని నన్ను యాంకరింగ్‌ చేసి కవర్‌ చేయమంటూ రెక్వస్ట్‌ చేసిందని చెప్పాడు. రాసుకునే వాళ్లకు రాసుకున్నంత అంటూ కొట్టి పారేశాడు. అలాగే సమంత నన్ను మంచి స్నేహితుడిగా చూస్తుంది. ఆ సంగతి తనే స్వయంగా ఆమే మీడియా తో చెప్పిన విషయం గుర్తు చేశాడు అలీ.