Begin typing your search above and press return to search.
పవన్ కు పంచ్ లేస్తూ వీడియో రిలీజ్ చేసిన అలీ
By: Tupaki Desk | 9 April 2019 6:37 AM GMTరాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సినీ నటుడు కమ్ తన స్నేహితుడు ఆలీ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందుకు స్పందనగా తాజాగా అలీ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ తనపై చేసిన వ్యాఖ్యలకు అలీ ఘాటుగా రియాక్ట్ అయ్యారనే చెప్పాలి.
ఇంతకీ వీడియోలో అలీ ఏం మాట్లాడారన్నది చూస్తే..
- ‘అలీ కష్టాల్లో ఉంటే సాయపడ్డాను అని మీరంటున్నారు..ఏం సాయ చేశారు? డబ్బిచ్చారా? సినిమాలు లేక ఇంట్లో కూర్చుంటే తీసుకెళ్లి సినిమా అవకాశాలు ఇప్పించారా?’
- ‘‘పవన్ కల్యాణ్ గారు రాజమండ్రిలో మీరు ఒక చిన్న కామెంట్ చేశారు. సర్..! నేను పుట్టి పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకు ఏదైనా చేస్తే బాగుంటుందని నా తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి - కులమతాలకు అతీతంగా పేదలకు సేవ చేస్తున్నా.
- ఆ సమయంలో నా గురించి మాట్లాడాలన్న ఆలోచన మీకు రాకపోయినా, మీ చుట్టు పక్కల ఉన్న వాళ్లు ‘అలీ గురించి ఒక కామెంట్ చేయండి. రాజమండ్రి కదా బాగుంటుంది’ అని చెప్పి ఉంటారు. మీరు వేరే ఏ జిల్లాలో నా గురించి కామెంట్ చేసినా, నేను స్పందించే వాడిని కాదు.
- చిరంజీవిగారు వేసిన బాటలో మీరు వచ్చారు. కానీ, నా బాట నేనే వేసుకున్నా. నా బాటలో నేనే నడిచా - నాకు ఎవరి సపోర్ట్ లేదు. చెన్నై నాకు జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో కృషి చేస్తే, నేను ఈ స్థాయిలో ఉన్నా. నా వల్ల ఎవరైనా లాభం పొందారు తప్ప. నేను ఎవరి వద్దా చేయి చాపలేదు. నేను ఎవరినీ ఏమీ అడగలేదు.’’
-‘‘అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయ పడ్డా’ అన్నారు. ఏ విధంగా సాయపడ్డారు? డబ్బిచ్చారా? నాకు సినిమా అవకాశాలు ఇప్పించారా? మీరు ఇండస్ట్రీకి రాకముందే నేను మంచి స్థానంలో ఉన్నా. నేను ఎవరి దగ్గరకు వెళ్లి, ‘అయ్యా నాకు సాయం చేయండి’ అని అడగలేదు.
- ఆ అల్లా దయ వల్ల చాలా బాగున్నా. ఒకవేళ అడిగే అవకాశం వస్తే, అప్పటికి అలీ ఉండడు. ఆకలితో చచ్చిపోతాను తప్ప. వెళ్లి అడుక్కోను. ఆ విషయం మీకూ తెలుసు. ఎవరి మనసు నొప్పించేలా.. నేను మాట్లాడను. కానీ, మీరు ఆ మాట అనడం బాధేసింది.
- వైసీపీలోకి వెళ్లడం తప్పేంటి? రాజకీయ పార్టీలోకి వచ్చాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. నేను ఇప్పటివరకూ చాలా సభల్లో పాల్గొన్నా కానీ, ఎక్కడా మీ గురించి, మీ పార్టీ గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఎందుకంటే గతంలో చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. మీకు నా గుండెల్లో స్థానమిచ్చా. కానీ, మీరు చాలా పెద్ద మాట మాట్లాడేశారు.’’
-‘మీరు పార్టీ పెట్టినప్పుడు మీరు ఎదగాలని మీ ఆఫీస్ కు వచ్చి మంచి మనసుతో మీకు ఖురాన్‌ను ఇచ్చాను. మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి లైనులో ఉండే మొదటి వ్యక్తిని. నా చుట్టానికి టికెట్ ఇచ్చానని మీరు అన్నారు. నేను మిమ్మల్ని వచ్చి అడిగానా? లేదా మీరు నాకు చెప్పి ఇచ్చారా?
- మీరు ఏ రోజైనా నాకు ఫోన్ చేసి, ‘అలీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?నేను పార్టీ పెట్టా. నా పార్టీలోకి రా’ అని అడిగారా? అడగనప్పుడు ఎందుకు సర్ కామెంట్ చేయడం.. నాకు చాలా బాధగా ఉంది. క్షమించడి.. ధన్యవాదాలు’’