Begin typing your search above and press return to search.
కామెడీ అయితే.. సమంతను అలా అడగటమా?
By: Tupaki Desk | 16 Sep 2018 4:38 AM GMTకమెడియన్ గా వెండితెర మీదా.. ప్రయోక్తగా బుల్లితెర మీద కనిపించే సీనియర్ హాస్యనటుడు ఆలీ. ఇండస్ట్రీలో దశాబ్దాల తరబడి ఉంటున్న ఆలీకి.. అందరితో చనువు ఎక్కువ. తనకు దగ్గరితనాన్ని తన షోలకు వాడేసే ఆలీ.. కెమేరా ముందు వేసే కొన్ని కుళ్లు జోకులు.. గలీజు ప్రశ్నలు ఇప్పటికే పలుమార్లు విమర్శలకు గురయ్యారు.
తాజాగా అలాంటి పనే మరోసారి చేశారు. ఈసారి ఆయన నోటి దూల విస్మయానికి గురి చేసేలా ఉందంటున్నారు. ఆలీ ప్రయోక్తగా వ్యవహరించే ఒక టీవీ షోకు సమంత హాజరైంది. ఆమె తాజాగా నటించిన యూటర్న్ (కన్నడ డబ్బింగ్ మూవీ) వినాయకచవితికి విడుదల కావటం.. దాని ప్రచారంలో భాగంగా ఈ షోలో పాల్గొన్నట్లు చెబుతున్నారు.
సోమవారం టెలికాస్ట్ అయ్యే ఈ షో టీజర్ పై పలువురు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. చిలిపి ప్రశ్నల పేరుతో గలీజుగా మాట్లాడే అలవాటున్న ఆలీ వేసిన కొన్ని ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు సామ్ అభిమానులు. ఇంట్లో చైతును ఏమని పిలుస్తారన్న ప్రశ్నకు కాస్త సిగ్గుపడుతూ.. బేబీ అన్న మాటను చెప్పింది సమంత. ఇలాంటివి కాస్త చిలిపిగా.. మరికాస్త ఆసక్తిగా ఉంటాయి వోకే.
మరోసందర్భంలో అత్తారింటికి దారేది మూవీలో హిలేరియస్ కామెడీ ఎపిసోడ్ అయిన.. స్వామి నదికి పోలేదా? మాటను ఈ షోలో ప్రస్తావించి.. మరి.. నాగచైతన్య నదికి పోలేదా? అని అడగటం..దానికి బదులిచ్చిన సమంత.. చైతూ నదికి వెళ్లడని.. తన వద్దే ఉంటాడని చెబుతూ.. ఆలీ మీరు చాలా డేంజరండి అంటూ సమంత బదులిచ్చారు.
ఎవరిని ఏం అడగాలో కూడా తెలీదా? అన్న మాట ఆలీని ఉద్దేశించి పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తనకున్న చనువుతో.. చాలా కార్యక్రమాల్లో నోరు జారే ఆలీ.. సామ్ విషయంలో ఇలాంటి ప్రశ్న వేయటం సరికాదంటున్నారు.