Begin typing your search above and press return to search.

అలీ కూతురి పెళ్లి వీడియో.. షేర్ చేసింది ఎవరంటే..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 3:18 PM GMT
అలీ కూతురి పెళ్లి వీడియో.. షేర్ చేసింది ఎవరంటే..!
X
స్టార్ కమెడియన్ అలీ ఈ మధ్యనే తన కూతురు ఫాతిమా మ్యారేజ్ చేశారు. అంగరంగ వైభవంగా సినీ రాజకీయ సెలబ్రిటీస్ మధ్య ఫాతిమా మ్యారేజ్ జరిగింది. సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా అందరికి ఆప్తుడైన అలీ తన కూతురు పెళ్లిని చాలా గ్రాండ్ గా జరిపారు. కమెడియన్ గానే కాదు స్టార్ హోస్ట్ గా కూడా అలి ఈమధ్య అలరిస్తున్నారు. ఆయన చేస్తున్న అలీతో సరదాగా షో కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది. అలీ భార్య జుబేదా అలీ కూడా ప్రేక్షకులకు పరిచయమే. సొంతంగా యూట్యూబ్ చానెల్ ప్రారంభించి అలీకి సంబందించిన షూటింగ్ విషయాలను అందులో షేర్ చేస్తుంటారు జుబేదా అలీ.

ఇక లేటెస్ట్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో తన కూతురు పెళ్లి వీడియోని షేర్ చేశారు జుబేదా అలీ. ఈ వీడియోలో పెళ్లి షాపింగ్ నుంచి హల్దీ ఇంకా ఫాతిమాని పెళ్లి కూతురుగా చేయడం కూడా కవర్ చేశారు. ఇక పెళ్లికి వచ్చిన సెలబ్రిటీస్ దగ్గర నుంచి పెళ్లి తంతు ముగించుకుని కూతురుని పంపించేప్పుడు ఎమోషనల్ అయిన వీడియో కూడా ఇందులో కవర్ చేశారు.

తన ఫ్యామిలీకి సంబందించిన ప్రతి విషయాన్ని యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసుకుంటున్న జుబేదా అలీకి 6 లక్షల 91 వేల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఆ రేంజ్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టే ఆమె ఏ వీడియో షేర్ చేసినా సరే నిమిషాల్లో లక్షల వ్యూస్ తెచ్చుకుంటాయి.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అలీ అంటే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగిన ఆయన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే హీరోగా కూడా ప్రయత్నించారు. సినిమాలో సంపాదించిన దాన్ని సినిమాలోనే ఖర్చు పెట్టాలి అన్నట్టుగా నిర్మాతగా కూడా సినిమాలు చేశారు అలీ. కమెడియన్ గానే కాదు టీవీ హోస్ట్ గా కూడా అలీ తన మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో అందరివాడు గా ఉన్నాడు అలీ అందుకే అతని కూతురు పెళ్లికి పరిశ్రమ కదిలి వచ్చింది.

అలితో స్టార్ హీరో కాంబినేషన్ సీన్స్ కొంతకాలం ట్రెండ్ గా నడిచింది. హీరో ఫ్రెండ్ గా అలీ చేసిన కమెడియన్ రోల్స్ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. తెలుగు పరిశ్రమ తన అక్కున చేర్చుకుందని అలీ తన కెరీర్ గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంటారు. ప్రస్తుతం అలీ వైసీపీ సపోర్టర్ గా ఉన్నారు. అందుకే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైసర్ పదవి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.