Begin typing your search above and press return to search.
ఆలీ జనసేన తరఫున కాదా?
By: Tupaki Desk | 18 March 2018 7:39 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు.. సీనియర్ కమెడియన్ ఆలీకి మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరిదీ దశాబ్దాల అనుబంధం. పవన్ నటించిన సినిమాల్లో 90 శాతం వాటిలో ఆలీ ఉంటాడు. వ్యక్తిగతంగా కూడా వీళ్లిద్దరూ మాంచి దోస్తులు. ఈ విషయాన్ని పవన్ సైతం వేదికల మీద చెబుతుంటాడు. ఈ నేపథ్యంలో పవన్ రాజకీయ పార్టీ జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో ఆలీ పోటీ చేయొచ్చన్న అంచనాలు జనాల్లో ఉన్నాయి. ఈ మధ్య హైదరాబాద్ లో జనసేన కార్యాలయ ఆరంభోత్సవానికి ఆలీ ఖురాన్ తో హాజరై ప్రార్థనల్లో కూడా పాల్గొన్నాడు. దీంతో ఆలీ పక్కాగా జనసేనలో చేరతాడని.. ఎన్నికల్లో పోటీ చేస్తాడని జనాలు ఒక అంచనాకు వచ్చేశారు.
కానీ ఆలీ మాత్రం ఆ విషయాన్ని ధ్రువీకరించట్లేదు. జనసేన తరఫున పోటీ చేస్తారా అని అడిగితే.. ‘‘మా మధ్య ఇప్పటిదాకా ఆ చర్చ రాలేదు. విజయం నాదే.. ఓటమి నాదే అనుకునే రకం పవన్. ‘మీకు ఆసక్తి ఉందా.. నాపై నమ్మకం ఉందా.. ఉంటే రండి’ అంటారు. అంతే తప్ప బలవంతం చేయరు’’ అని ఆలీ నర్మగర్భమైన సమాధానం ఇచ్చాడు. అంతే తప్ప ఆయన పిలిస్తే వస్తా అనే మాట మాత్రం మాట్లాడలేదు. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అని ఆలీని అడిగితే.. ‘‘ఆ సమయం వచ్చినపుడు ఎవ్వరూ ఆపలేరు. 1999లో మురళీమోహన్ గారు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఇప్పించారు. ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. ఇప్పుడు నిర్ణయం ఏంటనడిగితే చెప్పలేను. సమయం రావాలి. ఇప్పుడే చెబితే వేడి తగ్గుతుంది. పెసరట్టుప్మా వేడి మీద తింటేనే రుచి’’ అంటూ సామధానం దాటవేశాడు. ఆలీ మాటల్ని బట్టి చూస్తుంటే అతను జనసేన తరఫున పోటీ చేయడం సందేహంగానే అనిపిస్తోంది. ఆలీకి తెలుగుదేశం తరఫున టికెట్ కన్ఫమ్ అయినట్లు చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.