Begin typing your search above and press return to search.

ఇంతమందుండగా ఆలీనే ఎందుకు?

By:  Tupaki Desk   |   19 Aug 2015 4:50 AM GMT
ఇంతమందుండగా ఆలీనే ఎందుకు?
X
ఏటికేదాడికీ మెరుగవుతూ టాలీవుడ్ ఫిలిం ఫేర్ గా పరిగణిస్తున్న 'సినీ మా అవార్డ్స్' ఈ సంవత్సరం కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది. తారల తళుకులు, స్టార్ల హంగామా, అందాల భామల నృత్య ప్రదర్శనలు, ఆసక్తి గొలిపే అవార్డులు, అనాదిగా వస్తున్న సూపర్ హిట్ సినిమా స్పూఫ్ లతో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిపోయింది.

అయితే ఈ వేడుకకు హోస్ట్ లుగా ఫిక్స్ అయిన ఆలీ సుమల ద్వయంలో ఆలీపై మరోసారి ఘాటైన విమర్శలు వెల్లివిరిశాయి. టైమింగ్ కోసం అనవసర పంచ్ లు, డబుల్ మీనింగ్ డైలాగులతో పలుమార్లు తారలని హార్ట్ చేశాడు. ఈ వేడుకలో రాశీఖన్నా ఆలీ బాధితురాలిగా నిలిచింది. ఆడియో ఫంక్షన్ లైతే సుమ ఒకత్తే మేనేజ్ చేసుకోగలదు గానీ ఇటువంటి వేడుకలకు ఇద్దరు వ్యాఖ్యాతలు తప్పనిసరి.

అయితే టాలీవుడ్ లో టైమింగ్ తెలిసిన యువహీరోలకు కొదవలేదు. అల్లరి నరేష్, నాని వంటి వారు ఈజీగా ఇటువంటి వేడుకలను హోస్ట్ చెయ్యచ్చు. మన నిర్వాహకులు అ కోణంలో ఆలోచించలేదో లేక మన హీరోలకు ఇష్టంలేదో గానీ ఆలీతోనే నెట్టుకోచ్చేస్తున్నారు. హిందీ ఫిలిం ఫేర్ ఫంక్షన్ లకు షారుఖ్, రణబీర్, సైఫ్ వంటి బడా తారలు యాంకరింగ్ చేయడం మనకు తెలిసినదే. హిట్ అయిన ప్రతీదానిని బాలీవుడ్ నుండి దిగుమతి చేసుకునే మనవాళ్ళు ఈ పాయింట్ ని ఎందుకు వదిలేశారబ్బా..