Begin typing your search above and press return to search.

పవన్ నవ్వు వెనుక అదా రీజన్

By:  Tupaki Desk   |   22 March 2017 10:52 AM GMT
పవన్ నవ్వు వెనుక అదా రీజన్
X
అప్పట్లో ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతుంటే పవన్ పగలబడి నవ్వడం చాలా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో ఎవరినైనా ట్రోల్ చేయాలంటే ఈ నవ్వును వాడుకుంటూ ఉంటారు జనాలు. ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ నవ్వు. తాజాగా ‘కాటమరాయుడు’ ఆడియో వేడుకలో పవన్ తుళ్లిపడుతూ నవ్వడం కూడా అలాగే ఫేమస్ అయింది. ఈ వీడియో క్లిప్ పెట్టి నెటిజన్లు ఆల్రెడీ చాలా విషయాలపై ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. ఐతే పవన్ అంతలా ఎందుకు నవ్వాడన్నది మాత్రం జనాలకు అర్థం కాలేదు. ‘కాటమరాయుడు’ నిర్మాత శరత్ మరార్ పవన్ ను పొగుడుతుంటే ఆలీ ఏదో అన్నాడు. అప్పుడే పవన్ పగలబడి నవ్వాడు. ఆలీ ఏదో అడల్ట్ జోక్ వేసి ఉంటాడని అంతా అనుకున్నారు.

ఐతే ఆ రోజు అసలేం జరిగిందో.. పవన్ ఎందుకు అంతలా నవ్వాడో ఆలీనే స్వయంగా వెల్లడించాడు. పవన్ హార్వర్డ్ యూనివర్శిటీలో మాట్లాడినపుడు సూటులో అందంగా ఉన్నాడని.. ‘కాటమరాయుడు’లో పంచెకట్టులో ఇంకా అందంగా ఉన్నాడని శరత్ మరార్ అన్న సంగతి తెలిసిందే. మరార్ అంతలా పొగిడేస్తుండేసరికి ‘మళ్లీ పెళ్లి ఏమైనా చేస్తాడా ఏంటి’ అన్నాడట ఆలీ. అది వినే పవన్ అంతలా తుళ్లిపడుతూ నవ్వేశాడట. తానేదో స్పాంటేనియస్ గా అలా అనేశానని.. పవన్ అంతగా నవ్వుతాడనుకోలేదని.. ఈ నవ్వు పవన్ అభిమానుల్లో అంత చర్చకు దారితీస్తుందని కూడా తాను ఊహించలేదని ఆలీ చెప్పాడు. పవన్ మీద అలాంటి జోక్ పేల్చాడంటే ఆలీ అతడికి ఎంత క్లోజో దీన్ని బట్టే అర్థమవుతోంది కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/