Begin typing your search above and press return to search.
అలీ-పవన్ మధ్య గ్యాప్ క్రియేట్ చేసిందెవరు?
By: Tupaki Desk | 15 Dec 2022 11:24 AM GMTసినీ అభిమానులతో పాటు అందరినీ అలరించిన ప్రోగ్రాం ''అలీతో సరదాగా''. ప్రముఖ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా ఓ టీవీ చానల్ లో వచ్చే ఈ కార్యక్రమం ఎందరో ప్రముఖుల అంతరంగాన్ని ప్రజలకు పరిచయం చేసింది. దీంతోపాటు అసలు ఈ ప్రోగ్రాం విజయవంతానికి కారణం మరో అంశమూ తోడయింది. అలీది తెలుగు సినీ పరిశ్రమతో నాలుగు దశాబ్దాలకు పైగా బంధం. ఆ క్రమంలో ఆయన చెన్నైలో రెండు దశాబ్దాలున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ పురుడు పోసుకున్నప్పటి నుంచీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరో హీరోయిన్లు, నటులు.. ఇలా ఎందరో అలీకి పరిచయం. వారి వ్యక్తిగత విషయాలు అలీకి, అలీ వ్యక్తిగత విషయాలు వారికి తెలుసు. దశాబ్దాల కిందటి నాటి సంగతులను గుర్తుకుతెస్తుండడంతోనే అలీతో సరదాగా కార్యక్రమం మిగతా ఇంటర్వ్యూల కంటే భిన్నంగా ఉండేది.
కొంత విరామం ఇస్తారా? ఎంతో మన్నన పొందిన అలీతో సరదాగా కార్యక్రమానికి కొంత విరామం ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. ఏ షో అయినా దీర్ఘకాలంగా కొనసాగితే ప్రేక్షకులకు అంతగా రుచించదు. కాస్త గ్యాప్ ఇచ్చి కొత్తగా వస్తే మజా అనిపిస్తుంది. ఆ కోణంలో ఆలోచించే అలీతో సరదాగాకు విరామం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారికప్రకటనేదీ లేదు.అంతా ఊహాగానమే.
ఈ వార ఆయనే అతిథి.. గతంతో కంటతడి?తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు ఎందరినో అలీతో సరదాగాలో కూర్చుండబెట్టిన ఈ షోలో ఈవారం అతిథి ఎవరో తెలుసా? వారూవీరూ కాదు.. ఏకంగా అలీనే. అవును 300 పైగా షోలలో అలీ అందరినీ అలరించారు. చాలాసార్లు తారల గతాన్ని గుర్తుచేసి కంటతడి పెట్టించారు. అలాంటిది ఈ వారం ఆ అలీనే గెస్ట్ గా రాబోతున్నారు. అయితే, చిత్రం ఏమంటే ఈ షోలో అలీ అందరి చేదు గురుతులను తడిమి కంటతడి పెట్టించేవారు. ఈసారి ఆయన చేదు గురుతు కూడా బయటకు వచ్చింది.
వ్యాఖ్యాత ఎవరనుకున్నారు..?అలీలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలంటే ఆ స్థాయి యాంకర్ ఉండాలి. మరి తెలుగులో అంతటి యాంకర్ ఎవరంటే సుమ కనకాల పేరునే చెప్పాలి. ఆమె ఈ వారం అలీతో సరదాగాలో అలీని ముఖాముఖిగా ప్రశ్నలడిగారు. సహజంగానే సుమ షోలో ఉంటే హాస్యానికి కొదవుండదు. అలీని కూడా అలాగే ఆమె ప్రశ్నలతో నవ్వించారు. డిసెంబరు 19న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
గ్యాప్ క్రియేట్ చేసిందెవరో చెబుతారా? 'ఆలీతో సరదాగా'350 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. అందులో భాగంగానే రొటీన్ కు స్వస్తి పలుకుతూ.. మొనాటనీని వీడుతూ కొంత విరామం ఇవ్వనున్నట్లుగా సమాచారం. కాగా, ఈసారి అలీనే ఇంటర్వ్యూ ఇస్తుండడం.. సుమ ఇంటర్వ్యూ చేస్తుండడంతో చాలా సరదాగా సాగనున్నట్లు ప్రోమోను చూస్తే తెలుస్తోంది. ఆలా సాగిన ఎపిసోడ్‌లో 'పవన్ కల్యాణ్‌కు మీకూ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది' అని సుమ అడిగారు. దీనికి 'గ్యాప్‌లేదు.
గ్యాప్ క్రియేట్ చేశారు' అంటూ అలీ సమాధానం చెప్పారు. అసలు ఏం జరిగిందో అని చెప్పేదగ్గర బీప్ వేశారు. అసలు విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాలి. అయితే, గ్యాప్ ను క్రియేట్ చేసిందెవరు? అనేది పూర్తి ఎపిసోడ్ లో అయినా అలీ చెబుతారా..? ఆ గ్యాప్ రాజకీయాల కారణంగా వచ్చిందా? లేక సినిమాల నేపథ్యంలో వచ్చిందా..? ఇటీవల అలీ కుమార్తె పెళ్లికి పవన్ హాజరు కాకపోవడం దగ్గర్నుంచి.. అలీకి ఏపీ ప్రభుత్వం సలహాదారు పదవి ఇవ్వడం.. వచ్చే ఎన్నికల్లో పోటీ తదితర అంశాలపై ఏం చెబుతారో చూడాలి?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.