Begin typing your search above and press return to search.
పొరాడి కెప్టెన్ పీఠం దక్కించుకున్న అలీ
By: Tupaki Desk | 15 Aug 2019 5:23 AM GMTబిగ్ బాస్ హౌస్ కి కొత్త కెప్టెన్ వచ్చాడు. వరుణ్ సందేశ్ తర్వాత రెండో కెప్టెన్ గా అలీ ఎంపికయ్యాడు. మొన్న కెప్టెన్ కోసం జరిగిన నేనే రాజు నేనే మంత్రి టాస్క్ లో డ్రాగన్ ఎగ్స్ సొంతం చేసుకున్న అలీ - రాహుల్ - రవి లకి బుధవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఒక సింహాసనాన్ని పెట్టారు. దానిని సొంతం చేసుకుని చివరికి ఎండ్ బజర్ మోగే వరకు ఎవరైతే సింహాసనంలో ఉంటారో వారే ఇంటి కొత్త కెప్టెన్ అవుతారని చెప్పాడు.
ఇక డ్రాగన్లు సింహాసనం కోసం పోటీ పడే సమయంలో మిగిలిన ఇంటి సభ్యులు తమకు ఇష్టమైన డ్రాగన్ ను సింహాసనంలో కూర్చోబెట్టొచ్చు.. ఇష్టంలేని డ్రాగన్ ను సింహాసనం నుంచి లాగేయ్యొచ్చు. అయితే స్టార్ట్ బజర్ మోగిన వెంటనే అలీ రెజా పరుగున వెళ్లి సింహాసనంలో కూర్చున్నాడు. అతనికి అండగా శ్రీముఖి - బాబా భాస్కర్ - మహేశ్ - జ్యోతి - హిమజలు అండగా నిలిచారు.
అటు అలీని దించడానికి రాహుల్ అండ్ టీం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ కుదరలేదు. ఆఖరికి అలీకి మద్ధతుగా ఉన్నవారు మేము పక్కన ఉంటామని. మీరు అలీని దించడానికి ప్రయత్నించవచ్చని - కానీ అలీ ఓడిపోతాడు అనే సమయంలో వచ్చి అతనికి సాయం చేస్తామని చెప్పారు. దీంతో రాహుల్ - రవికృష్ణ మాత్రమే 15 నిమిషాల పాటు అలీని సింహాసనం నుంచి దించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వారిద్దరి వల్ల కాలేదు.
ఆఖరికి ఎండ్ బజర్ మోగేసరికి అలీ సింహాసనంలో ఉన్నాడు. దీంతో అతన్ని బిగ్ బాస్ కెప్టెన్ గా ప్రకటించారు. ఆ తరవాత హౌస్ మేట్స్ అలీ ఆధ్వర్యంలో సమావేశమై.. ఇంట్లోని సమస్యలని కొత్త కెప్టెన్ అలీకి చెప్పుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన అలీ పరిష్కార మార్గాలు చెప్పడంతో.. హౌస్ మేట్స్ అలీకి జై కొట్టారు.